ప్రశ్న 1 : ఎరువులు అంటే ఏమిటి?
జ : ఎరువుల (నియంత్రణ) చట్టం 1985 లోని షెడ్యూల్-1 కింద పొందుపరచిన వస్తువుల్లో ఎరువులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫై చేసిన ఎరువుల మిశ్రమం, ప్రత్యేక ఎరువుల మిశ్రమం కూడా ఎరువులే. ఎరువుల (నియంత్రణ) చట్టం షెడ్యూల్-1లో 75 రకాల ఎరువులను కేంద్రప్రభుత్వం చేర్చింది.
ప్రశ్న 2 : ఎరువుల మిశ్రమానికి, కాంప్లెక్స్ ఎరువులకు మధ్య తేడా ఏమిటి?
జ : కాంప్లెక్స్ ఎరువుల్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. వాటి ఉత్పత్తి సమయంలో రసాయనిక ప్రతిచర్య ఏర్పడుతుంది. ఎరువుల మిశ్రమాన్ని కలిపేటప్పుడు రసాయనిక ప్రతిచర్య ఉండదు. రెండు లేదా మూడు రకాల ఎరువులను భౌతికంగా కలవడానికి ఎరువుల మిశ్రమంగా వ్యవహరిస్తారు.
ప్రశ్న 3 : ఎరువుల అమ్మకం వ్యాపారాన్ని ప్రారంభించడమెలా?
జ : సంబంధిత అధికారుల నుంచి అధికార పత్రం పొందిన ఎవరైనా ఎరువుల అమ్మకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ప్రశ్న 4 : అధికారిక లేఖ పొందడానికి ఏమి చేయాలి ?
జ : హోల్ సేల్ డీలర్ గానైనా రిటైల్ డీలర్ గా నైనా ఎరువుల వ్యాపారం ప్రారంభించదలచుకున్న వ్యక్తి ఫాం ‘A1’ లోని మెమొరాండం ఆఫ్ ఇంటిమేషన్ ను సంబంధిత అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. వాటితోపాటు సంబంధిత అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. వాటితోపాటు ఎఫ్ సి ఓ లోని ‘ఓ’ నుంచి సోర్స్ సర్టిఫికెట్ ను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ఫీజును సమర్పించాలి.
ప్రశ్న 5 : సోర్స్ సర్టిఫికెట్ అంటే ఏమిటి ?
జ : రాష్ట్రప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ సోర్స్ సర్టిఫికెట్ అంటే అమ్మదలచిన ఎరువులను కమోడిటి బోర్డ్, ఉత్పత్తిదారుడు, దిగుమతిదారుడు, పూల్ హాండ్లింగ్ ఏజెన్సీలలో దేనినుంచి తెచ్చుకుంటున్నారో వివరించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోర్స్ సర్టిఫికెట్ పొందాలి.
ప్రశ్న 6 : నోటిఫైడ్ అథారిటీ అంటే ఎవరు ?
జ : అధికృత లేఖను జారీచేసే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం నియమించినదే నోటిఫైడ్ అథారిటీ.
ప్రశ్న 7 : ఉత్పత్తిదారుడు కూడా అధికృత లేఖను పొందాలా ?
జ : అవును
ప్రశ్న 8 : డీలర్ అంటే ఎవరు ?
జ : టోకుగా కానీ చిల్లరగా కానీ, పారిశ్రామిక అవసరాల కోసం కానీ ఇందులో ఉత్పత్తిదారుడు, పూల్ హ్లాండ్లింగ్ ఏజెన్సీ కూడా ఉండవచ్చు. ఎరువుల అమ్మకం వ్యాపారం చేసే వ్యక్తిని డీలర్‌గా వ్యవహరిస్తారు.
ప్రశ్న 9 : ఒకే రకమైన ఎరువులను ఒక వ్యక్తి అమ్మవచ్చా ?
జ : ఒక వ్యక్తి ఒకే రకమైన ఎరువును అమ్మకూడదు.
ప్రశ్న 10 : భారత ప్రభుత్వం నిర్ణీత ఎరువులనే అమ్మాలని నిర్దేశించిందా ?
జ : ఎరువుల నియంత్రణ చట్టంలోని షెడ్యూల్-1 కింద భారత ప్రభుత్వం కొన్ని గ్రేడులను ఉదహరిస్తూ అటువంటి ఎరువులను మాత్రమే అమ్మాలని నిర్దేశించింది.
ప్రశ్న 11 : అధికృత లేఖ ఎంతకాలం వరకు అమలులో ఉంటుంది ?
జ : జారీ చేసిన నాటి నుంచి మూడేళ్ల వరకు అధికృత లేఖ అమలులో ఉంటుంది.
ప్రశ్న 12 : టోకుగా కానీ చిల్లరగా గానీ ఎరువుల అమ్మకం వ్యాపారం ప్రారంభించడానికి మరో అధికృత లేఖ అవసరమా ?
జ : అవును
ప్రశ్న 13 : ధరల నియంత్రణ కిందికి ఎన్ని ఎరువులు వస్తాయి ?
జ : మూడు ఎరువులు మాత్రమే. అవి యూరియా, జింకేటెడ్ యూరియా, అన్హిడ్రస్ అమోనియా ఎరువులు.
ప్రశ్న 14 : మిశ్రమ ఎరువుల తయారీకి సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను ఎవరు నిర్దేశిస్తారు?
జ : రాష్ట్రప్రభుత్వం
ప్రశ్న 15 : మిశ్రమ ఎరువుల తయారీకి రాష్ట్రప్రభుత్వం నుంచి కానీ కేంద్రప్రభుత్వం నుంచి కానీ అనుమతి పొందాలా?
జ : అవును. సంబంధిత రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్పత్తిదారుడు అనుమతి పత్రం పొందాలి.
ప్రశ్న 16 : ఉత్పత్తి ధృవపత్రం పొందడానికి అవసరమైన షరతులు ఏమిటి ?
జ : కనీస ప్రయోగశాల సదుపాయాలు ఉండడం తప్పనిసరి.
ప్రశ్న 17 : ఉత్పత్తి ధృవపత్రం మంజూరు చేయడానికి కాలవ్యవధి ఏమైనా ఉందా?
జ : అవును. దరఖాస్తు స్వీకరించిన నాటి నుంచి 45 రోజులు.
ప్రశ్న 18 : ఉత్పత్తి ధృవపత్రం మంజూరుకు నిరాకరించిన పక్షంలో ఇతర అధికారులకు అప్పీలు చేసుకునే అవకాశం ఉందా? ఉంటే ఆ అధారిటీ పేరేమిటి?
జ : అవును. రాష్ట్రప్రభుత్వం నియమించిన అప్పిలేట్ అథారిటీకి నివేదించుకోవచ్చు.
ప్రశ్న 19 : ఉత్పత్తి ధృవపత్రం ఎంతకాలం అమలులో ఉంటుంది ?
జ : జారీ చేసిన నాటి నుంచి మూడేళ్లవరకు
ప్రశ్న 20 : ఉత్పత్తి ధృవపత్రం, అధికృత లేఖను పునరుద్ధరించుకోవచ్చా?
జ : అవును.
ప్రశ్న 21 : పునరుద్ధరణ దరఖాస్తును ఎప్పుడు చేసుకోవాలి?
జ : రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన ఫీజును ఎఫ్సివో ‘డి’లో ఉన్న దరఖాస్తు పత్రంతో కలిపి ఉత్పత్తి ధృవపత్రం గడువు (మూడేళ్ళు) ముగిసేలోపే సంబంధిత అధికారులకు సమర్పించాలి.
ప్రశ్న 22 : ఎరువుల ఉత్పత్తిదారుడు ఎటువంటి గ్రేడు మిశ్రమ ఎరువులనైనా తయారు చేయవచ్చా?
జ : కాదు. రాష్ట్రప్రభుత్వం నోటిఫై చేసిన గ్రేడులను మాత్రమే తయారుచేయాలి.
ప్రశ్న 23 : ఉత్పత్తి ధృవపత్రం పొందడానికి నియమ నిబంధనలు ఏమిటి?
జ : ఎఫ్ సివోలోని ఫాం ‘డి’ ని నింపి, నిర్ణీత రుసుంతో రిజిస్టరింగ్ అధారిటీకి సమర్పించాలి.
ప్రశ్న 24 : నిర్ణీత గడువు తర్వాత పునరుద్ధరణ దరఖాస్తు చేసుకోవచ్చా?
జ : అవును. నిర్ణీత గడువు తర్వాత నెలరోజుల వరకు అదనపు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రశ్న 25 : ప్యాకింగ్, మార్కెటింగ్ లకు సంబంధించి ఉత్పత్తిదారుడు అనుసరించిన విధివిధానాలేమిటి ?
జ : (1) ప్రతి ఎరువుల బస్తా మీద ‘ఎరువు’ అనే పదం పెద్దగా, స్పష్టంగా
కన్పించాలి.
(2) కల్తీ చేయడానికి వీలు లేకుండా ఎరువుల బస్తాలను సీల్ చేయాలి. చేతితో కుట్టిన గోతములకు సీసం సీలు వేయాలి.
ప్రశ్న 26 : ప్రమాణాలు లేని ఎరువులను మార్కెట్ లో అమ్మవచ్చా?
జ : వీలు లేదు.
ప్రశ్న 27 : నాణ్యతా ప్రమాణాలు పాటించని ఎరువును ఎవరికి తిప్పిపంపాలి ?
జ : అటువంటి వాటిని మిశ్రమ ఎరువుల తయారీదారుకు, పరిశోధనాకేంద్రానికి పంపవచ్చు.
ప్రశ్న 28 : వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను అమ్మవచ్చా ?
జ : అవును. కానీ కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే అమ్మవచ్చు.
ప్రశ్న 29 : పారిశ్రామిక అవసరాలకు ఎరువుల అమ్మకం కోసం ధృవపత్ |