| సవరిస్తే ఇబ్బందులు తప్పవు |
| ప్రచురణ తేది: 02/11/2009 |
|
స మాచార హక్కు చట్టాన్ని సవరించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను కేంద్ర సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ వ్యతిరేకించారు. చట్టాన్ని సవరిస్తే అధికార యంత్రాంగానికే లాభమని ఆయన అన్నారు. అప్రయోజన దరఖాస్తులను తిప్పి పంపే అధికారాన్ని పీఐవోలకు అప్పగిస్తే.. ప్రతి సమాచారాన్ని వారు తిరస్కరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అప్రయోజన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయన్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వ్యాఖ్యల నేపథ్యంలో సహ చట్టానికి మార్పులు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారు పక్షం వహిస్తూ శైలేష్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. |
|