| సమాచారం.. అవినీతి నిరోధకం |
| ప్రచురణ తేది: 02/11/2009 |
|
కేం ద్రం నుంచి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ యంత్రాంగంలో వేళ్లూనుకున్న అవినీతి దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అవగాహన పెంచుకుని.. దానికి 'సమాచారాన్ని' అందించడం ద్వారా అవినీతిని అడ్డుకోవచ్చు.
ఏసీబీ ఏం చేస్తుందంటే.. అవినీతి నిరోధక చట్టం (1988) కిందకు వచ్చే నేరాలకు పాల్పడే 'ప్రజా సేవకుల'పై ఏసీబీ చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం, విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త తదితరాలు, ప్రజలు నుంచి వచ్చే సమాచారంపై కూడా ఏసీబీ విచారణ నిర్వహిస్తుంది. ప్రభుత్వ అధికారి/ఉద్యోగి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు లంచం అడిగినా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా అవినీతి నిరోధక శాఖాధికారులు రంగంలోకి దిగుతారు. ప్రజలు చేసే నిర్థిష్టమైన లిఖిత పూర్వక ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తారు. దాడులు నిర్వహించి లంచావతారులకు సంకెళ్లు వేస్తారు. ప్రభుత్వ అధికారులు/సిబ్బందికి ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదులు వస్తే.. సంబంధిత వ్యక్తుల పూర్తి వివరాలు సేకరిస్తారు. చేసే ఉద్యోగం ఏమిటి? జీతం ఎంత? వారికి ఉన్న ఇతర ఆదాయాలను పరిశీలిస్తారు. 'ఆస్తులు'న్న ప్రతి చోటా తనిఖీలు చేస్తారు. ఆస్తిపాస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, నగలు స్వాధీనం చేసుకుంటారు. కేసులు నమోదు చేస్తారు. అవినీతి నిరోధక చట్టం కింద నేరం రుజువైతే ఆర్నెల్ల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడుతుంది.
ఏవరైనా .. ఏసీబీ అధికారులకు 'సమాచారం' ఇవ్వొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ఏసీబీ కార్యాయాలయాలు ఉన్నాయి. వాటిల్లోని అధికారులను నేరుగా, ఫోనులో సంప్రదించవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. dg_acb@ap.gov.in కి ఫిర్యాదులను ఈమొయిల్ చేయవచ్చు. ఏసీబీ కార్యాలయాల చిరునామాలు, ఫోన్ నంబర్లను www.acbap.gov.in లో చూడవచ్చు.
డబ్బు దొరికితే.. అంతే కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల వ్వాలంటే ముడుపులివ్వాల్సిందే. వ్యక్తిగత ఇబ్బందులతో అలాంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రారు.అప్పుడు ఏసీబీ అధికారులే ఆకస్మిక తనిఖీలు చేస్తారు. దొరికిన సొమ్ముకు లెక్కలు చూస్తారు. సరైన ఆధారాలు లేకుంటే కేసు నమోదు చేస్తారు. ప్రజాధనం దుర్వినియోగంపైనా ఏసీబీ విచారిస్తుంది. నిధుల దుర్వినియోగం జరిగిందని నిరూపితమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుంది.
సహ చట్టంతో.. * మీరు చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలు తెలుసుకోవచ్చు. * ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు, జప్తు చేసిన ఆస్తులు * నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై తీసుకున్న చర్యలు * విచారణ పూర్తయిన, పెండింగ్ కేసులు, జాప్యానికి కారణాలు - వి.రమేష్‌కుమార్, విజయవాడ
అ వినీతి వల్లే దేశ ప్రతిష్ఠ మసకబారుతోంది. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న 'పెద్దవాళ్ల'ను వదిలేసి చిన్న ఉద్యోగులను పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. - ప్రధాని మన్మోహన్‌సింగ్
ఏసీబీలో పీఐవోలు పీఐవో - అడిషనల్ డైరక్టర్, ఏసీబీ ప్రధాన కార్యాలయం, మోజంజాహీ మార్కెట్, ఎం.జె.రోడ్, హైదరాబాద్ - 01 జిల్లా కార్యాలయంలో - డీఎస్పీ
మ న సామాజిక, ఆర్థిక పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఏనుగంతటి ఆ బలాన్ని చిన్న అవినీతి పురుగు పీల్చి పిప్పి చేస్తోంది. ఈ చీడను వెంటనే వదిలించుకోవాలి. - మాజీ రాష్ట్రపతి కలాం |