| సమాచారహక్కుచత్తమ్ ప్రకారము పరవాద మ్.ర్.ఒ. నన్దు 4బ్ ప్రకారము 16 అమ్సాలకు సమ్బన్దిచిన సమాచారమ్ తెలుగులొ ప్రజలకు అన్దుబతులొ ఉన్చాలి. కాని పరవాద మ్.ర్.ఒ. లొ ఎతువన్తి సమాచారమ్ లెదు. దానిని ఎలా ప్రజలకు అన్దుబాతులొకి తెవాలి , తెలుపగలరు. |
| - పి స్వామి |
| సమాధానము : | అధికార భాష తెలుగులో ప్రజా సమాచార అధికారులు సమాచారం ఇవ్వాలి. (సహ చట్టం, సెక్షన్ 4(1)(బి) ప్రకారం) ఆంగ్లంలో సమాచారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్, హాకా భవన్, హైదరాబాద్ - 500 004 కు ఫిర్యాదు చేయండి. |
|
|
| మాది కర్నూలు జిల్లా, ఆలూరు మండలము ఆలూరు చెక్ పోస్టు నందు బళ్ళారి - గుంతకల్ ప్రధాన రహదారి యందు కల్వర్టు పాడైపోయినది.ఇది జరిగి సుమారుగా 5 నెలలు కావస్తూంది.దీనిపై ఆర్ & బి జూనియర్ ఇంజనీయరు గారికి అర్జీ ఇస్తే ఆయన సరిగ స్పందించక పోగా డిఈ గారికి సర్పంచ్ గారితో మండల అధ్యక్షుల వారితో అర్జీ పై సంతకాలు చేయించి పంపించు అని ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వారితో ఎలా పని చేయించడం? ఇలాంటి వారు స.హ.చ.ను ఖచ్చితంగా ఎలా ఉపయోగించడం? |
| - రాము |
| సమాధానము : | మీరు ఆర్ & బీ ఇంజనీరుకు పాడై పోయిన కల్వర్ట్ పై అర్జీ ఇచ్చామని చెబుతున్నారు. అర్జీ అధికారికి ఇచ్చినట్లు వారి సంతకముతో కూడిన నకలు కాపీలు మీ వద్ద ఉంటే సహ చట్టం కింద దరఖాస్తు చేయవచ్చు. మీ అర్జీపై సంబంధిత కార్యాలయ అధికారులు తీసుకున్న చర్యల నివేదికలు ఇవ్వమని కోరడం ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవచ్చు. మరిన్ని వివరాలకు 08415- 246999కు ఫోన్ చేయండి. |
|
|
| మనల్ని పరిపాలిస్తున్న మనం ఎన్నుకున్న ఎన్నుకుంటున్న యం యల్ ఎ లు, యం పి లు, యం యల్ సి లు, మొత్తం మంత్రుల్తో సహా అన్నిరాష్ట్రాల కు సంబంధించిన ఖర్చు గురించి తెలుసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి, తెలుపగలరు. |
| - విశ్వనాధ్ |
| సమాధానము : | మీ ప్రశ్న స్పష్టంగా లేదు, మీకు కావాల్సిన వివరాలకు ఈ కింది ఫోన్ నంబర్ కు సంప్రదించగలరు.
08415 - 246999కు ఫోన్ చేయండి. |
|
|
| నమస్కారం.
ముందుగా మీకు సమాచార హక్కు చట్టం పై అందరికి అవగాహన కల్పిస్తున్నందుకు ధన్యవాదములు.
అటవీ శాఖ పరిధిలో జరిగే పరీక్షల మార్కులు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చా?
దయచేసి తెలుపగలరు.
ధన్యవాదములు. |
| - సురేష్ కుమార కడలి్ |
| సమాధానము : | అటవీ శాఖ నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన మార్కులు, జవాబు పత్రాలను సహ చట్టం కింద పొందవచ్చు.
ప్రజా సమాచార అధికారి,
చీఫ్ కన్జర్వేటర్ కార్యాలయం,
అటవీ శాఖ, సైఫాబాద్, హైదరాబాద్ - 500 004.ఈ చిరునామాకు దరఖాస్తు చేసుకోవచ్చు. |
|
|
| ఉద్యొగస్తుల సమస్యల పరిష్కారనికి "సహ" చట్టము వర్తిస్తుందా? |
| - డీ.వేణుగొపాల్ |
| సమాధానము : | మీరు ఏ శాఖకు చెందిన ఉద్యోగులో తెలుపలేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనాలు, పదోన్నతులు, సర్వీసు రిజిస్టర్లు, వార్షిక రహస్య నివేదికలు పొందవచ్చు. |
|
|
| సార్, నేను ఒక పోలీసు అదికారి పై అవనీతి నిరొధక సాఖకు అక్ర్రమ ఆస్తి పై ఫిర్యాదు చేసాను ఫొటో తొ సహా పంపన్చాము.అయినా అటువన్టీ చర్య
లేదు. దీనిపై ఏవరికి ధరఖాస్తు చేయాలి. మీరు చేసే మున్దడుగు నాలాన్టీ వారికి చాలా ఉపయొగ పడుతుంది.నాకు మీ సలహా కావలి.లేదంటె వారి అక్రమాలను మీకు ఈ-మెయిల్ చేస్తాను.మీ సలహా కొసమ్ ఎదురు చూస్తాను |
| - ముప్పిది క్రాన్థి |
| సమాధానము : | మీరు ఈ కింది చిరునామాకు రిజిస్టరు పోస్టు ద్వారా (మీ దరఖాస్తుపై దరఖాస్తు రుసుం రూ.10లు కోర్టు ఫీ స్టాంపు) పంపించండి.
చిరునామా: ప్రజా సమాచార అధికారి,
అడిషనల్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం,
అవినీతి నిరోధక శాఖ, ఎం.జె. మార్కెట్ రోడ్,
హైదరాబాద్ - 500 001.
దరఖాస్తుతోపాటు మీరు ఏసీబీకి ఫిర్యాదు చేసిన నకళ్లను జతపరచండి. దరఖాస్తులో "నేను ఫలానా తేదీన పంపిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, రోజువారి ప్రగతి నివేదికలు" కోరవచ్చు. |
|
|
| కరీమ్ నగర్ రీజియనల్ బ్యా0కులొ సమాచార ప్రథినిధి ఎవరు?నా బదిలికి స0భ0ధి0చిన సమాచారమ్ కోసమ్ ఎవరికి దరఖాస్థు పెట్టాలి ?నేను బ్యా0కులొ క్లర్క్ గా పని చేస్థున్నాను.దయచేసి అన్దిచగలరు.
రమాకా0త్ , గ0గాధర,కరీమ్ నగర్ జిల్ల |
| - రమాకాన్థ్ |
| సమాధానము : | మీరు ఏ బ్యాంకుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో తెలపలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్రాంచి మేనేజర్ కేంద్ర సహాయ ప్రజా సమాచార అధికారి. ప్రతి బ్యాంకులో సీపీఐఓ, సీఏపీఐఓ, అప్పీలు అధికారుల వివరాలను తెలిపే బోర్డులను అందరికి కనపడే విధంగా ఉంచాలి. కరీంనగర్ లో మా ప్రతినిధి కె. అశోక్ (9951943322)ను సంప్రదించండి. |
|
|
| మాది రాయచొటి, కడప జిల్లా. సమాచార చట్టం గురించి తెలుసుకొవలంటె ఎవరిని కలవాలి |
| - ఎమ్.శ్రీనివాసులు |
| సమాధానము : | కడప ఈనాడు యూనిట్ కార్యాలయంలో ముందడుగు ప్రతినిధి శ్రీ ఎస్.ఎ.నాజర్ బాషా (9347423416)ను సంప్రదించండి. |
|
|
| కరీంనగర్ జిల్లలొ గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను గూర్చి తెలియజెయగలరు.అలాగే గ్రామాలలొ గొర్రెల గ్రాసముకొరకై ప్రభుత్వం కల్పించే భూ కేటాఈంఫూలను గుర్చి థెలుపగలరు |
| - రవి నన్నబొయిన లక్మాజిపల్లి |
| సమాధానము : | రాష్ట్ర పశు సంవర్థక శాఖ పశుగ్రాస అభివృద్ధికై చిన్న, సన్నకారు రైతులకు, బలహీన వర్గాల వారికి 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలు సరఫరా చేస్తుంది. పూర్తి వివరాల కోసం ప్రజా సమాచార అధికారి, పశు సంవర్థక శాఖ, ఆం.ప్ర. సచివాలయం, హైదరాబాద్ అనే చిరునామాకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు మా ముందడుగు కార్యకర్త కె.అశోక్ (99519 43322) ను సంప్రదించండి. |
|
|
| గ్రామ పరిధిలొ యాదవులకై ప్రభుథ్వమ్ కల్పిస్థున్న పథకలను గూర్చి థెలుపగలరు |
| - రవి నన్నబొయిన లక్మజిపల్లి;జమ్మికున్త |
| సమాధానము : | యాదవుల అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ శాఖ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారులకు శిక్షణా కార్యక్రమాలు, పాలు, మాంసం, కోళ్ల అభివృద్ధి, వైద్య, ఆరోగ్య సహకారం మొదలగు పథకాలున్నాయి. పూర్తి వివరాల కోసం ప్రజా సమాచార అధికారి, పశు సంవర్థక శాఖ, ఆం.ప్ర. సచివాలయం, హైదరాబాద్ అనే చిరునామాకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు మా ముందడుగు కార్యకర్త కె.అశోక్ (99519 43322) ను సంప్రదించండి. |
|
|
| ఈనాడు ముందడుగు అద్బుతంగా వుంది. శుభాకాంక్షలు |
| - మహబూబ్ బాష |
|
|
| నాది కర్నూలు. నాకు డిపార్టమెన్ట్ ఆఫ్ మెడీకల్ అన్డ్ హెల్త్, నందు సమాచారం కావాలి నేను హైదరాబాద్ వచీ అప్లై చెయ్యాలంటేహ కుదరదు పోస్ట్ దావారా అప్లై చెయ్యటానికి వుందా. వుంటే ధరఖాస్తు నంబర్ పొందడం యెలా. |
| - రమేష్ |
| సమాధానము : | మీరు ప్రజా సమాచార అధికారి, వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, హెచ్ - బ్లాకు, ఆం.ప్ర సచివాలయం, హైదరాబాద్ అనే చిరునామాకు సహ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. |
|
|
| Sir,
Please arrange for dispay of GO Ms.NO.66 (Appeal Rules) for down load. |
| - Ch. Harikishan Rao |
| సమాధానము : | జీవో కాపీని మీ ఈ మెయిల్ కి జతపరుస్తున్నాము. |
|
|
| సర్, మా పట్టణంలొ ఈమద్య కొన్ని షాపులపై ఐ.యం.ఐ. (ఇండియన్ ముసిక్ ఇండస్త్రి) వారు దాడి చెసి మెమెరి కార్దులొ పాటలు నింపించుకుని లైసెన్సు లేదని వారిపై కాపి రైటు క్రింద కేసులు నమోదు చెసారు. కాపీరైటు క్రింద ఇండియాలొ పాటలు మెమెరి కార్దులొ నింపడానికి లైసెన్సు తిసుకున్నవారి వివరాలు స.హ.చ. క్రింద వివరాలు తెలుసుకోవచా! |
| - మోహన్ |
| సమాధానము : | సహ చట్టం కింద కింది చిరునామాకు దరఖాస్తు చేసి మీరు కోరిన సమాచారం పొందవచ్చు. Central Public Information Officer, Indian Music Industry, Crescent Towers, 7th Floor, B-68, Veera Estate, off New Link Road, Andheri West, Mumbai-400 053. |
|
|
| మాది సిరిసిల్ల పటణం, ఆదివారం రొజు షాపులు తెరువకూడదు అని ఇక్కడి లేబర్ ఆపిసర్ గారు చెప్పారు. కాని కొన్ని చొట్ల షాపులు తెరిచిన పట్టించుకొవడం లేదు. దీనిపై స.హ. ప్రకారం వివరాలు అడుగవచ్హ్హా! |
| - చంద్రశెఖర్ |
| సమాధానము : | అడగవచ్చు. ప్రజా సమాచార అధికారి, జిల్లా కార్మిక అధికారి కార్యాలయం, కరీంనగర్ వారికి సహ చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు మా ముందడుగు కార్యకర్త కె.అశోక్ (99519 43322) ను సంప్రదించండి. |
|
|
| సిర్,
ఈ వన్త్ తొ ఇన్ఫొర్మ్ ఒనె థిన్గ్ తొ పొలిచె ఒఫ్ అప్ రెగర్దిన్గ్ వరన్గల్ అచ్చిద్ అత్తచ్క్ చసె, థె చొమ్మొన్ ఎపెచ్తెద్ థిన్గ్ అస్ హప్పెనెద్ బుత్ ఫ్రొమ్ నెత్ తిమె ఇన్స్తేద్ ఒఫ్ ఎన్చౌత్రిన్గ్ థ్రొవ్ అచిద్ ఒన్ థెమొన్ థెరె చొచ్క్ ఇమ్పొర్తన్త్ల్య్ అన్ద్ థెన్ ఒన్ థెరె ఫచె చౌసిన్గ్ సెవెరె బుర్న్స్ థెన్ లొచ్క్ థెమ్ ఉప్ ఇన్ థె చెల్ల్ ఒర్ బైల్ థెమ్ ఔత్ , లెత్ థెయ్ అల్సొ ఫచె థె సమె పైన్ వ్హత్ థె గిర్ల్స్ అరె ఫచిన్గ్, బ్య్ కిల్లిన్గ్ థెమ్ యౌ విల్ల్ బె ఇన్ త్రౌబ్లె అన్ద్ థెయ్ ఎపెరిఎన్చె పైన్ ఒన్ల్య్ నొత్ థె పైన్ ఫచిన్గ్ బ్య్ థె గిర్ల్స్ ఇన్ ఫుతురె, అన్ద్ హెన్చె కిన్ద్ల్య్ లూక్ ఉప్ ఇన్ మ్య్ సుగ్గెస్తిఒన్ , అన్ద్ ఒనె థిన్గ్ ఇఫ్ వె హవె ఏర్త్ థెరె ఇస్ అ వయ్ హెన్చె కిన్ద్ల్య్ థిన్క్. |
| - దీపక్ |
| సమాధానము : | మీ ప్రశ్న స్పష్టంగా లేదు. దయ చేసి ఆంగ్లంలో లేదా తెలుగులో టైప్ చేయగలరు. |
|
|
| Sir, Muslims ni B.C. (E) lo kaliparu. Maaku OBC Reservation vartistunda. Vartiste OBC serial No. Dayachesi Teliyacheyagalaru. |
| - S.M. Shareef |
| సమాధానము : |
ముస్లింలలోని షేక్, మొగల్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బి.సి (ఇ)కి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదలాయిస్తూ తుది నిర్ణయం తీసుకోమని కోరింది. కావున రిజర్వేషన్లు హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. |
|
|
| రాష్త్ర కమీషన్లొ 2 కేసులు వేసినాము. ఆదికారులకు ఆనుకులంగానే తీర్పు ఇచ్చారు. నా వద్ద ఉన్న సమచారమును మీకు పంపుతాను, మీ ఆడ్రస్ తెలుపండి. |
| - బియ్యంకార్ స్రినివాస్, ఆద్యక్ష్లులు, పౌర సంక్షెమ స |
| సమాధానము : | జిరాక్స్ ప్రతులను ఈ కింది చిరునామాకు పంపగలరు.
ఈనాడు ముందడుగు,
రామోజీ ఫిల్మ్ సిటి, హైదరాబాద్ - 501 512
ఫోన్ నంబరు - 08415 246999 |
|
|
| నేను బ్యాంకు నుండీ హౌంసిన్గ్ లోన్ తీసుకున్నాను.
నా ఒరిజినల్ పత్రాలు బ్యాంకులో వున్నాయ్.
నా వద్ధ వాటికి సంభంధించిన పత్రాలు లేవు కావున నా వధ్ద ఆ పత్రాలు ఒరిజినల్ వుండాలంటే బ్యాంకు వారు నోటరి ద్వారా బ్యాంకు వారు సొంత ఖర్చుతొ మాకు ఇచ్చినట్టెతె మాకు ఒరిజినల్ పత్రాలు వుంటాయ్ లేద మా ఒరిజినల్ పత్రాలు స్కాన్ చేసి ఇవ్వాలంటే ఏవరిని సంప్రదించాలి.
ఏస్.బి.హెచ్ బ్యాంకు |
| - బాలాజి గంగాధర్ |
| సమాధానము : | బ్యాంకు నిబంధనల మేరకు రుణాన్ని పూర్తిగా చెల్లించిన తరువాత మీ ఒరిజినల్ పత్రాలు తిరిగి పొందవచ్చు. లేదా మీ పత్రాలను స్కాన్ చేసి సి.డి. రూపంలో ఇవ్వవలసినదిగా బ్యాంకు వారికి సహ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. |
|
|
| కార్యాలయాలలో ప్రజా సమాచార అధికారుల బోర్డులను పెట్టడంలేదు. ఎవరికి ఫిర్యాధు చేయాలి. |
| - అవినాష్ బాబు |
| సమాధానము : | రాష్ట్ర సమాచార కమిషను, హాకా భవను,;పబ్లిక్ గార్దెన్ ఎదురుగా, హైదరాబాదు-500 004 కు ఫిర్యాదు చేయాలి.
|
|
|
| నెను బాంక్ నందు లొను తీసుకొనాను.మ ఇంటి పత్రలు థకత్తు పెత్తినానునయొక్క పథ్రలకు బాంకు వాల్లదగ్గరినుండీ నొటరి కస్తమర్ కు బాంకు కుపథరలను పొందలటె ఎవరిని కలవాలీ.ఫ్రథి డాకుమెంటు ఇవలంటె మన దగర పతీ కాపీ ఉండాలంటె ఎవరిని కలవలి. |
| - బాలాజీగంగాదర్ |
| సమాధానము : | మీ ప్రశ్న స్పష్టంగా లేదు |
|
|
| అప్లికేషను కొరకు సైనిక్ స్చూల్ కొరకు 9వ తరగతీ వెబ్ సఐట్ తెలపగలరు కొరుకొన్డ సైనిక్ స్చూల్ |
| - బాలాజీగగాధర్ |
| సమాధానము : | http://www.sainikschoolkorukonda.org/ |
|
|
| సమాచార హక్కు చట్టం కింద గ్రామ స్థాయిలో దరఖాస్తు చేసేటప్పుడు ఎంత ఫీజు చెల్లించాలి? |
| - లావణ్య |
| సమాధానము : | గ్రామ స్థాయిలో ఏ విధమైన ఫీజు చెల్లించనవసరం లేదు. |
|
|
| పీఐవోల జాబితా ఉపయోగకరంగా ఉంది. |
| - శరత్ బాబు |
|
|
| Dear Sir,
As usual I had found in The Hindu a couple of days ago the publicaiton of a notice inviting suggestions on the implementation of Right to Information Act, 2005 published by the Rajya Sabha Secretariat. The suggestions can be emialed to: rs-cpers@sansad.nin.in with in 30 days.
I would like to draw the attention of the readers as well as the rulers of this country to the fact that we spend crores of rupees on publising advertisments showcasing PM, Sonia Gandhi, Indira Gandhi, Rajiv Gandhi and our YSR and others for launching schemes, celebrating children's day, women's day, etc., but we would restrict ourselves to publish the above invitation in a very insignificant way so that it does not draw the attention of many and thereby many would not submit their suggestions and the Act's implementation does not need any significant change.
Why this notice was not publihsed with the photographs of PM, Sonia, Indira Gandhi, Rajiv Gandhi? Can we construe that they do not need to associate with this kind of notices that invites suggestions from the citizens of this country. This clearly shows where the focus of those governing the country. Shame and shame on our governing system. I demand a thorough probe into the various advts released by both the centre and state govts and the money spent on these ads so far since the new govts at both centre and state took office. I want the State to explain as to why the above invitation was published in a very insignificant manner?
A citizen
--
IVNS Raju
Plot No.160/5; II Floor
Road No.23
Vivekanandanagar Colony
Kukatpally - Hyderabad - 500 072
Phone: 040-23060945 (R)
Mobile: 97015 19307
==========================================
Creativity is unfolding the Divinity within
===========================================
|
| - ఇ.వెం.నా.స.రాజు |
| సమాధానము : | we agree with you. you can share your views with us.
|
|
|
| అయౄ, నెను యెదైన సెలస్ఖన్ ప్ర్రొసీదీన్గ్స్ అదగవచా. దనినీ 8(1)(ఇ) కిఇన్ద తీరస్కరిన్చవచ్హ - సూర్య |
| - ఇమ్మని సూర్యానారయణ |
| సమాధానము : | మీరు నిరభ్యంతరంగా సెలక్షన్ ప్రొసీజర్స్ అడగవచ్చు. 8 (1) తిరస్కరించడానికి వీలు లేదు |
|
|
| ఓసి పేదవిధ్యార్దులకు ప్రభుత్వముఉచితముగా చదివిస్తారనివార్తలువచ్చాయి.మరి వైశ్య పేదవిద్యార్ధులకు ఈపథకము వర్తిస్తున్దా. |
| - వూన వేన్కటేశ్వ్ర్రర రావు |
| సమాధానము : | ఓసి కేటగిరి అంటే వాటి వర్గంలోకి వచ్చే ఏ కుల స్థులకైనా ఈ పథకం వర్తిస్తుంది |
|
|
| సర్ మాదీ నల్లగొంద .దన్దమ్పల్ల్య్ గ్రమము.మా గ్రామ పంచాయతికి ఇందిరమ్మ ఆధర్స గ్రామ పంచాయతి కింద ఎని నిధుల మంజూరు గురున్చి కార్యదర్షి ని అదిగిథె ఇవ్వదమ్ లెదు.పెన్సన్ గురున్చి ఎవరని అదగలి.వివరాలు చెప్పగలరు. |
| - వెనకన్న |
| సమాధానము : | సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 నుంచి 60 రోజుల్లో సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీలును ఎం.పి.డి.ఒ. కు చేయవచ్చు. 30 నుంచి 45 రోజుల్లో సమాచారం రాకుంటే 90 రోజుల్లోపు సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు రెండో అప్పీలు చేసుకోవచ్చు |
|
|
| ఒ.సి కి కుల ద్రువీకరణ పత్రం ఇవ్వరా? ఎమ్మార్వో కి అ అధికారం లేధా? ఈ.బి.సి స్కాలర్ షిప్ లొ కుల ద్రువీకరణ పత్రం కావలని మెన్షణ్ చెసారు.కాని ఎమ్మార్వోలు ఇవ్వటము లెదు. కావున మేము ఎమి చెయాలి? |
| - గనెష్ |
| సమాధానము : | బీసీ,ఎస్సీ, ఎస్టీ లకు అనుబంధం 3 మేరకు కుల ధృవీకరణ పత్రాన్ని తహశీల్దారు జారీ చేస్తారు. ఒసి కింద వచ్చే కులస్థుల విషయంలో తెల్ల కాగితంపై
టైపు చేసుకోమని అడిగితే మంజూరు చేసి సంతకం చేస్తారు. లేదా ఎందుకు ఇవ్వరో వ్రాత పూర్వకంగా అడగండి. |
|
|
| ఏల్.బి. నగర్ మునిసిపాలిటీలో ఎంతమది పింఛనును పొందుతున్నారో దయచేసి చెప్పగలరు. |
| - సందీప్ |
| సమాధానము : | మీరు ఎల్.బి. నగర్ మున్సిపాలిటీ పీఐఓ కు దరఖాస్తు చేసి పొందగలరు. |
|
|
| అసెంబ్లి ఏర్పాటు అయిన సమయం నుంచి ఈ రోజు వరకు ఎం.ఎల్. ఏ వివరములు గల వెబ్ సైట్ పేరు తెలపగలరా?
|
| - జి.సుబ్రమణ్య్హం |
| సమాధానము : | ఎం.ఎల్.ఏల సమాచారం కోసం ప్రజా సమాచార అధికారి, ఉప కార్యదర్శి, శాసన సభ ప్రాంగణం, హైదరాబాద్-500004కు దరఖాస్తు రుసుం రూ.10లు కోర్టు ఫీ స్టాంపు/ఐపీఓను పంపి సమాచారం పొందవచ్చు. వివరాలకు 08415 - 246999కు ఫోను చేయండి. |
|
|
| దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డి విజన్ సీనియర్ పీ ఐ ఓ కు ఇంజనీరింగ్ శాఖలొ స.హ.చత్త క్రి0ద ది.3-11-08 దరఖాస్తు చేస్తె తప్పూదు సమాచారము ఇచ్చారు వర్క్ జరిగిన తెన్దర్ ఫఇనల్ కాలేదని ఇచ్చారు రైల్వయ్పప0పిన లెతర్ సిపి/568/సహచ/05/325ది7-11-08 |
| - గుంద్ల రమేష్ మాజిదివిజనల్ రైల్వవినియొగదారులకన్సల్త |
| సమాధానము : | దరఖాస్తు తేదీ నుండి 60 రోజులు దాటకుండా టెండర్ ఫైలు ఫైనల్ కాలేదని అంటున్నారని, ఇవ్వలేమంటున్నారని అప్పీలేట్ అథారిటీకి మొదటి అప్పీలు చెయ్యండి. వివరాలకు 08415 - 246999 కు ఫోన్ చెయ్యండి. |
|
|
| సచ క్రిన్ద గ్రామ ప0చాయథి దోర్నకల్ లోమొర0 వేసినవివరాలు కై దరఖాస్థు చెస్తె 60రొజులు ధాతిన వివరాలు ఈవలేదు |
| - మ్ బ్ పాషా |
| సమాధానము : | సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 నుంచి 60 రోజుల్లో సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీలును ఎం.పి.డి.ఒ. కు చేయవచ్చు. 30 నుంచి 45 రోజుల్లో సమాచారం రాకుంటే 90 రోజుల్లోపు సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు రెండో అప్పీలు చేసుకోవచ్చు |
|
|
| సమాచర హక్కు అనుసరిన్చి పది సమ్వసరాల మున్దరి ఉత్తరువులు కొరవచున్న. ఒక వేల అట్టి కాగితములు లేనిచో ఏమి చేయవలెను. |
| - నగరజు |
| సమాధానము : | సహ చట్టం సెక్షన్ 8(3) ప్రకారం 20 సంవత్సరాలు అంతకన్నా ముందు సమాచారం కూడా పొందవచ్చు. వివరాలకు 08415 - 24699కు ఫోన్ చేయండి. |
|
|
| ప్రభుత్వరంగ బ్యాంకులు సమాచార హక్కు చట్టం కిందకు వస్తాయా? విద్యారుణం ఇవ్వకుండా బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నారు సమాచార హక్కు చట్టం ద్వారా అప్పీలు చేసుకోవచ్చా? |
| - కె.మల్లెషమ్. |
| సమాధానము : | బ్యాంకులు సహ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్రాంచి మేనేజరు కేంద్ర సహాయ ప్రజా సమాచార అధికారి విద్యారుణం పొందడానికి అర్హతలు, సమర్పించవలసిన పత్రాలతో దరఖాస్తు చేయండి. వివరాలకు 08415 - 246999 కు ఫోన్ చేయండి. |
|
|
| నెను నాన్ గేట్ ద్వారా యంటేక్ చెస్థున్నాను. యస్టీ వారీకి ఫీజూను గవర్నమెన్ట్ ఇస్థున్నది. కాని నాన్ గేట్ ద్వారా యంటేక్ చెస్థున్నవారిది సెల్ఫ్ ఫైనాన్స్ సిట్ . గవర్నమెన్ట్ సం॥రానికి 20000 రూ॥లు మాత్రమే ఇస్తున్నది. ఫీజు సం॥రానికి 50000 రూ॥లు . మీగతా 30000 రూ॥లు విద్యార్దులమె భరిన్ చాలట.మెము అడ్మిషన్ తిసుకున్నప్పుడు ఫీజు ప్రభుత్వమే భరిస్థున్ది అని నొటిఫికెషన్ లొ ఇచ్చారు. దీనికి పరిష్కారం మీరె చెప్పాలి . |
| - ప్రవీన్ కుమర్ |
| సమాధానము : | జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు మీకు కావలసిన సమాచారం కొరకు దరఖాస్తు విషయాలు తెలుసుకోగలరు. |
|
|
| సమాచారం కొరకు ప్రజావాణి ద్వారదరఖాస్తు 13/10/2008 రోజున చేసి
నాను. ఫిర్యాదు సంఖ్యా 5198. దీనికి నిర్ణయించిన ఆఖరి తేది28/10/
2008. ఈ రోజువరకు యేలాంటి సమాచారము నాకు సంభంధిత శాఖ
ఇవ్వ లేదు. నేను ఎవరికి అపీలు చేయాలి, చిరునామ తెలుపగలరు.
ఇట్లు
రాజ్ కుమార్ గాజరియా |
| - రాజ్ కుమార్ గాజరియా |
| సమాధానము : | సమర్పించ వలసిన దరఖాస్తుపై తీసుకున్న రోజువారీ చర్యల నివేదికలను జిల్లా రెవెన్యూ అధికారికి సహ దరఖాస్తు చేసి పొందగలరు. |
|
|
| నమాస్కరం సర్ మా గ్రామపంచయతి లొ ఎవరెవరికి పించను వస్తున్నయ్ ప్రస్తుతం ఎందరికి మంజురయ్యయి వారి అర్హతలెమిటి? ఈ విషయలు గురించి ఎవరికి దరఖస్తు చెయలి. దయచెసి తెలుపగలరు. |
| - సురెష్ |
| సమాధానము : | గ్రామ పంచాయతి కార్యదర్శికి దరఖాస్తు చేయండి. రుసుం లేదు. వివరాలకు 08415 246999 కు ఫోన్ చేయండి. |
|
|
| కరీమ్ నగర్ ఈనాదు మున్దదుగు ఫొన్ నమ్బర్ ఇవ్వండీ |
| - అనీల్ రావు తన్నీరు |
| సమాధానము : | కె. . అశోక్
ఈనాడు ముందడుగు, ఈనాడు కాంపౌండ్, ఎల్.ఎమ్.డి. కాలనీ
అలుగునూర్, కరీంనగర్ జిల్లా – 505 527
aashok_1974@rediffmail.com ,
99519 43322 |
|
|
| మా తాతకి 2 ఎకరాల భూమి కలదు దాని మీద తనాకా లొన్ కావాలి.యస్బీఐ అదికారిని కలిసాను వారు లొను రాదు అని అనారు.,లొను ఎలా పొఒదాలి. |
| - ప్రసాదు |
| సమాధానము : | స్థానిక బ్యాంకు బ్రాంచి మేనేజరుకు సహ చట్టం కింద దరఖాస్తు చేయండి. వ్యవసాయ భూమిపై రుణం పొందడానికి అర్హతలు, సమర్పించాల్సిన పత్రాలు, తనఖాలు, ఇచ్చే లోను వివరాలకు సంబంధించిన వివరాలు పొందవచ్చు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం మీరు రుణం పొందవచ్చు. మరిన్ని వివరాలకు 08415 - 246999కు ఫోన్ చేయండి. |
|
|
| కొత్త తూనికలు, కొలతల చతమ్ఎప్పటి నుండి అమలు జరుగుతుంది. |
| - కెశనం శ్రినివాసరావు |
| సమాధానము : | ప్రామాణిక తూనికలు, కొలతల చట్టాన్ని 1976లో చేశారు. ప్యాకేజి కమాడిటీ నియమాలను 01.01.2007న అప్ డేట్ చేశారు. మరిన్ని వివరాలకు 08415 - 246999కు ఫోన్ చేయండి. |
|
|
| సమాచార హక్కు 2005 చట్టానికీ, దానిని ప్రజల ముందుకు తీసుకు వచ్చిన ఈనాడు పత్రిక కు ధన్యవాదాలు.
మే నెల 2008 లో ఈనాడు పత్రికలో సమాచార హక్కు చట్టం 2005 గురించి చదివి 1997 నుండి పెండింగులో ఉన్న నా సీనియారిటీ సమస్య పై రాజమండ్రి మున్సిపల్ కమీషనర్ ను 1997 నుండి నేను ఇస్తున్న విన్నపాలపై తీసుకున్న చర్యలు తెలుపవలసినదిగా సమాచార
చట్టం 2005 ప్రకారం కోరాను. నెల రోజులలోగా నా సమస్య పరిష్కరించారు
యరమాటి వేణు గోపాల రావు
స్కూల్ అసిస్టెంట్
శ్రీ నన్నయ నగరపాలకోన్నత పాఠశాల
ఆర్యాపురం
రాజమండ్రి - 4
|
| - వేణు గోపాల రావు యరమాటి |
| సమాధానము : | మీ విజయాన్ని ముందడుగు పేజీలో సహ విజయంగా ప్రచురించగలం. వివరాలను రాజమండ్రి ముందడుగు సమన్వయకర్త సురేష్ (ఫోన్ నంబరు- 99519 33722) కు అందజేయగలరు. |
|
|
| పంచాయతి వారు మా వీథిలో ఏ అభివరుథి పనులు చెయ్యదమ్ లేదు.కావాలని నిర్లక్ష్యమ్ చేస్తున్నారు.'సహ ' ద్వారా కారణామ్ తెలుసుకోవచ్హ్హా.?
ధన్యవాదములు. |
| - టి.సి.పందరీ నాథ్ |
| సమాధానము : | గ్రామ పంచాయతి కార్యదర్శికి దరఖాస్తు చేయండి. రుసుం లేదు. వివరాలకు 08415 246999 కు ఫోన్ చేయండి. |
|
|
| నెను మా కుమారుడి కొరకు 08022008 నాదు పాస్ పొర్టు కొరకు చెన్నై లొ అప్లై చేసే ఉన్నాను. అపుడు నేను అక్కడ జాబ్ లో ఉన్నాను. పోలీసు వెరిఫికేషను 2 సార్లు పూర్తి అయినది. మరల మే మాసము లో 2వ సారి పి ఆర్ వో ని కలిసాము. 15 రోజులలో ప0పిస్తామని చెప్పారు. ఇపుదు నేను ఆంధ్ర ట్రాన్స్ ఫరు అయ్యాను. ఆ విషయము తెలియచేసాము. కాని ఇప్పటి వరకు ఏ విషయము తెలియచేయలేదు. ఎన్ని సార్లు కఅమ్ పలైవత్" (ఈమైల్) పంపించిన ప్రయోజనము లేదు. ఈ విషయములో సహాయము చేయగలరు. |
| - రవికుమర్ |
| సమాధానము : | సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ప్రజా సమాచార అధికారికి, ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం, శాస్త్రి భవన్, 26, Haddows Road, Nungambakkam, Chennai-600006 చిరునాకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం రూ.10 లు జతపరచాలి. దరఖాస్తులో పాస్ పోర్టు కోసం చేసిన దరఖాస్తుపై తీసుకున్న చర్యల నివేదికలు, రోజు వారి ప్రగతి నివేదికలు కోరవచ్చు. |
|
|
| 2005లో సమాచారహక్కు చట్టం అమలు ఐంధి కదా.మరీ 2004,దానీకీ మూందూ సంవత్స్రల సమచారన్ని కుడ తెలుసుకోవచ్హునా...తెలుపగలరు..
- రఘు
|
| - రఘు |
| సమాధానము : | సెక్షన్ 8(3) ప్రకారం దరఖాస్తు తేదీ నుంచి 20 సంవత్సరాల కింద జరిగిన సంఘటన విషయం గురించి సమాచారమైనా కోరవచ్చు. సబ్ సెక్షన్ (1) లోని ఎ, సి, ఐ మినహాయింపులు మాత్రమే వర్తిస్తాయి.
|
|
|
| సిర్ ,
ఒక కుమార్తై ఉన్నవారికి లక్ష రుపాయాలు ఇస్తామని ప్రభుత్వం అన్నది.
కానీ మాకు ఒక రూపాయి రాలేదు. కలెక్టర్ కార్యాలయంలో రూ. 3000 లు తీసుకుని ఒక జీ.ఓ ఇచ్చారు. అది మాకు అర్థం కాలేదు. దీని గురించి ఎవరిని సంప్రదించాలి. దయచేసి తెలుపగలరు?
|
| - నవీన్ రెద్ద్య్ |
| సమాధానము : | బాలికా సంరక్షణ పథకం కింద ఒక ఆడపిల్ల ఉన్న కుటుంబంలోని బాలికకు లక్ష రూపాయలు, ఇద్దరు ఆడపిల్లలే ఉన్నకుటుంబంలోని బాలికలకు 60 వేలు ప్రభుత్వం ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుంది. ఈ పథకం నకు ఎటువంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను కలవండి. |
|
|
| కులాంతర వివాహనికి సంబందించి పుర్తి వివరాలు తెలుపగలరు |
| - శ్రిను |
| సమాధానము : | బీసీ కులాలకు సంబంధించి జిల్లా బీసి సంక్షేమ అధికారిని, ఎస్సీ, ఎస్టీ కి సంబంధించి జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దానిలో అర్హతలు, మార్గదర్శకాలు, జీవోలు, దరఖాస్తులు తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 08415-246999 కు సంప్రదించగలరు.
|
|
|
| విదేషియుల అరెస్ట్ అని ఒక వార్త చదివాను.అరెస్ట్ అయిన ఆ విదేషియులను తిరిగి వాళ్ళ దేశాని కి పమ్పిచారా! ఆ కేసు గురిన్చి వివరాలు తెలుసుకోవచ్ఛా! |
| - శ్రీనివాస్ |
| సమాధానము : | పోలీస్ శాఖలో సంబంధిత పీఐఓకు దరఖాస్తు చేసి సమాచారం పొందవచ్చు. |
|
|
| నెను పస్స్ పొర్త్ అప్ప్ల్య్ చెసి 50 రోజులు ఇథునధి కాని నాకు ఇన్క రాలెదు...నెత్ లొ కి వెల్లి స్తతుస్ చెచ్క్ చెస్తె ఫిల్ "ఇల కనబదుథునది" ఇన్ఫొర్మతిఒన్ నొత్ అవ్లలిబలె ఒర్ ఫఇలె నొత్ ఎఇస్త్స్ థె దతబసె .. న ఫిలె ఎక్కద ఉన్ధి అని తెలుసుకొవాలి.నెను ఎప్పుదు ఎమి చెయాలి. నకు హెల్ప్ చెయ్యది |
| - సుబ్బరావు |
| సమాధానము : | పాస్ పోర్టు కోసం చేసుకున్న దరఖాస్తు, రిజిస్టర్ పోస్టు రశీదు జిరాక్సులు జతపరచి ‘కేంద్ర సమాచార అధికారి’ రీజనల్ పాస్ పోర్ట్ అధికారి కార్యాలయం, కుమ్మర గూడ, హైదరాబాద్-3 అనే చిరునామాకు నేను పంపిన పాస్ పోర్ట్ దరఖాస్తుపై తీసుకున్న చర్యల నివేదికలు, పౌర సేవ పత్రాల ప్రకారం 45 రోజుల్లో పాస్ పోర్టు పొందలేకపోవడానికి కారణాలపై రోజు వారి ప్రగతి నివేదికలు పంపాము. దరఖాస్తు రుసుం పది రూపాయలు ఐపిఓ జతపరచి పంపవచ్చు. మరిన్ని వివరాలకు 08415 - 246999 కు ఫోన్ చేయవచ్చు.
|
|
|
| నమస్కారాలు
అయ్యా
మాది నల్లగొన్ద పత్త్నమ్ 6 వ వార్ద్ గాన్ధి నగర్ ఈ క్రిన్ధి సమస్యలు పరిషిరిహిఒచన్ద్
1. థారు రోద్ల్లు లఈవ్.
2. ద్రైనజు లేదు ,
3. లొ వొలెనజు
4. ఒపెన్ మెరీ ల వల్ల్ దొమల వ్య్య్ప్తెఇ
నల్ల్గొగొన్చ్ద మొత్తొము ద్రైనేజు లినె వెస్త్థున్తె మా ప్రాతమ్మ్ లూ లెఎదు |
| - దయాకర రెద్ద్ద్ |
| సమాధానము : | తారు రోడ్లు, డ్రైనేజీ, మురుగు కాల్వలు, దోమల వ్యాప్తి గురించి ‘ప్రజా సమాచార అధికారి’, పురపాలక, సుప్రీం, నల్గొండ, వారికి గత 5 సంవత్సరాల నుంచి 6వ వార్డు అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు విడుదలైన నిధులు, ఖర్చు నివేదికలు, పనుల వివరాలు, కాంట్రాక్టర్ల పేరు, పని ప్రారంభించవలసిన తేది, పూర్తి కావలసిన తేది, పనులు నిలిపివేయడానికి కారణాలు తెలుపమంటూ దరఖాస్తు రుసుం పది రూపాయలు కోర్టు ఫీస్టాంపు దరఖాస్తుపై అంటించి పంపవచ్చు. మరిన్ని వివరాలకు 08415-246999కు ఫోన్ చేయవచ్చు. |
|
|
| నేను ఎస్ బి ఐ క్లెర్క్ ఎగ్జమ్ వ్రాసేను. నేను అర్హత పొ0ధలేదు.
నా యొక్క మార్క్స్ ఎలా తెలుసు కోవాలి.
సురేష్.
|
| - సురేష్ |
| సమాధానము : | ఎస్.బి.ఐ క్లర్క్.పరీక్ష గూర్చి మీకు రాతపరిక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి అన్న సమాచారాన్ని పరిక్షలు నిర్వహించిన శాఖకు సంబంధించిన ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు చేసుకుని స.హ.చ ప్రకారం సమాచారం పొందవచ్చును.
|
|
|
| నెను మా పఅచయథి లొ ఉన్న నిధులు గురిచి తెలుసుకొవదనికి ఎవ్వరికి
అర్జి పెతుకొగలను తెలుపగలరు |
| - క్రిష్న చైతన్య |
| సమాధానము : | గ్రామ పంచాయతి కార్యదర్సికి దరఖాస్తు చేయండి. రుసుము లేదు. వివరాలకు 08415 246999 కు ఫోన్ చేయండి. దరఖాస్తులు ఈనాడు ఏజెంట్ల వద్ద, ఈనాడు కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చును. |
|
|
| పొలముల లొ"కాలి బాట" అను పదానికి గవర్నమెంట్ పరి భాషలొ అర్దం ఏమిటి "కాలి బాట" ఈ పదమునకు గతములొ జి.ఓ లు కాని ఆర్డర్ ఏమైనా ఇచ్చి యున్నారా . తేది జి.ఓ లు కాని ఆర్డర్ నెంబరు యున్నదా. తెలియజేయగలరు. మరియు సమాచార చట్టము ద్వారా ఏలా తెలుసుకోవచొ తెలపగలరు.
జాగర్లమూడి శ్రినివాసరావు
చీమకుర్తి 523226 |
| - జాగర్లమూడి శ్రినివాసరావు |
| సమాధానము : | జీఓలు ఏమీ లేవు. |
|
|
| 1.మొదతి అప్పేల్ కాని రెన్దవ అప్ లు కాని చెసు కొనుతకు కాల వ్యవది వున్నద.వున్న్తె ఎన్త లొపల చెసుకొవలి.తరవాత చెస్థె యెమవుతున్ధి.
2. కమిషనర్ వున్నత విధ్యషాకలొ సమాచర అదికారి యేవరు
3.అప్పేల్స్ లొ కూద ఫీస్ ఎన్థ కత్తలి
4.అప్పేల్స్ పొస్త్ ద్వార పమ్ప వచ్హున. |
| - ఖూంఆఋ |
| సమాధానము : | దరఖాస్తు చేసుకొన్న రోజునుంచి ముప్పై నుంచి అరవై రోజుల్లోపల మొదటి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్కు ఫీజు లేదు. పోస్ట్ ద్వరా అప్పీల్ పంపవచ్చు. |
|
|
| ఇలాంటి గొప్న అవకాశాన్ని అందించిన ఈనాడుకి అభినందనలు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది నిజంగా ముందడుగే. |
| - ధజపాల్ రెద్ది (భోస్తన్) |
| సమాధానము : | మీ అందరి సహకారంతో ఈనాడు మీ తోడుగా ముందడుగులు వేయడానికి సిద్దం. |
|
|
| మది కొత్తపల్లి, జిన్నరమ్(మం),నర్సపుర్(తలుక),మెదక్. మా ఉరి వరికి ఈ చత్తమ్ గురిన్చి తెలుసుకొవలని ఉన్నది ఎమి చెయ్యలి? . మా ఉరిలొ తెలియక మొసపొతున్నమ్. నకొసమ్ కదు మా ఉరి వారి కొసాము |
| - రాజు |
| సమాధానము : | చట్టం గూర్చి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ముద్రించి ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ బుక్స్ కొనుగోలు చేసి తెలుసుకోవచ్చును. ఈనాడు ముందడుగు వెబ్ సైట్ తెలుగు లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ వెబ్ సైట్ ఇంగ్లీషుల్లోనూ చూచి తెలుసుకునే అవకాశం ఉన్నది. ప్రతి మంగళవారం ఈనాడు జిల్లా పేపర్ లో ముందడుగు పేజీ చదివితే అవగాహన కలుగుతుంది.
|
|
|
| రాజీవ్ స్వగృహ క్రింద మధ్యతరగతి ప్రజలకు ఇండ్లుఇస్తామని చెప్పి ఇంతవరకు స్తలసేకరణ జరుగలేదు. దీనిపై ఏమిచేయాలి. |
| - నాగేంద్రకుమార్ |
| సమాధానము : | మీరు ప్రజా సమాచార అధికారి గృహ నిర్మాణ శాఖకు సమాచార హక్కు చట్ట ప్రకారం దరఖాస్తు చేసుకుని మీకు కావలసిన పూర్తి సమాచారం పొందవచ్చు.
|
|
|
| 1)రిజిష్ట్రెషన్ ఐన తరువాత ఎన్ని రొజుల్లొ పట్టా పాస్ పుస్తకం ఇస్తారు?
దీనికి సంబదించిన వివారలు ఎవారిని అడిగి తెలుసుకొవాలి?
లేదా
పట్ట & పాస్ పుస్తకల కొసం అనుసరించె విధనం తెలియాజెయండి.
2) ఇంటర్ నెట్ సెంటర్ ఏర్పటు కొసం రిజిష్ట్రెషన్ ఎక్కడ చెసుకొవాలి?
|
| - బసంత్ రేడి |
| సమాధానము : | రిజిస్ట్రేషన్ అయిన తర్వాత భూమి యజమాని ఎమ్. ఆర్. ఓ. ముందుగా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ దరఖాస్తకు సంబంధించి స.హ చట్టం ప్రకారం ప్రజా సమాచార అధికారి అయిన తహశిల్దారుకు మీ దరఖాస్తు ఎవరు పరిశీలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఉద్యోగిపై చర్య తీసుకునే అధికారి పేరు, హోదా ఏమిటి, నేను పెట్టుకున్న దరఖాస్తు ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు అనే సమాధానాలు కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా పౌర సేవా పత్రంలో వివరాలు ఉంటాయి.
|
|
|
| సెజ్,పారిస్రామికవాద ల పెరుతొ వేల యెకరాలు దొచిపెదుతున్నరు. యెవరి సొమ్మని దానము చెస్తున్నారు.ఈ అక్రమాలు భూస్తాపితము అయ్యేరోజు దగ్గర పదుతున్నది.వాన్ పిక్ కి 28 వేల యెకరలా? వైజాగ్,కాకినాద పొర్త్ కి యెన్త ఉన్నది. దీనికెంత ఇస్తున్నారు.జనము ఉసురు ఊరికే పోదు.ఛెప్పే అభివ్రుద్ది కాకమ్మ కదలె.వాన్ పిక్ ఫైల్ ఇతె ఈ ఆక్రమిన్చనది యెమి చెస్తారు. జనము తిరగబది కొత్తేరొజు యెన్థొ దూరము లొ లేదు.కొస్తల్ బెల్త్ లో ఒక్క స్తానము కూద గెలవలేని పరిస్తితి కాంగ్రెస్ కి వస్తుంది. అపుదు తెలుస్తున్ది దెవుది పాలనో,రాక్షస పాలనో. |
| - రాజు |
| సమాధానము : | మీ ప్రశ్నలను మీ జిల్లా కలెక్టర్ కు సహ చట్టం ద్వారా దరఖాస్తు చేయగలరు. అవినీతిని అడ్డుకోవడానికి మీరు మీ సహచరులు వెంటనే దరఖాస్తు చేయగలరు. మా ప్రతినిధులు ఆలీషా (విశాఖపట్నం, ఫోన్ - 9951988644) సురేష్ (రాజమండ్రి - 99519 33722) సహకరిస్తారు. |
|
|
| సార్
నేను ఈ మద్య నాయొక్క సెల్ పోను పోగొట్టు కొన్నాను. అది పోలిస్ స్టేషన్ లొ కంప్లట్ చెసి దాని యొక్క చెర్టిపికెట్ అట్టాస్ చెసి స.హ.చట్టం క్రింద ఇన్ కమింగ్ మరియు అవుట్ గొయింగ్ కాల్స్ ఇమ్మని బి.ఎస్.ఎన్.ఎల్ జ.మే. కి అప్లయ్ చెసాను. కాని వాళ్ళు సరైన సమాచారము ఇవ్వక రెండు సార్లు తిప్పి పంపారు. ఇప్పుడు నేను ఎవ్వరికి కంప్లట్ చేయాలి. దయచేసి తెలుపగలరు.
|
| - వి. శ్రీనివాస మూర్తి |
| సమాధానము : | జ : 30 రోజుల్లో సమాచారం రాకుంటే దరఖాస్తు చేసిన నాటి నుంచి 60 రోజుల లోపల కింది చిరునామాకు అప్పీలు చేసుకోవచ్చు. చీఫ్ జనరల్ మేనేజర్, టెలికాం, బీఎస్ఎన్ఎల్, దూర సంచార భవన్, అబిడ్స్, హైదరాబాద్-1 మరిన్ని వివరాలకు www.ap.bsnl.co.in లోకి లాగిన్ అవండి |
|
|
| ఈనాడు మున్దడుగుకి ధన్యవాదములు...
మాది హైదరాబాద్ సమీపములో ప్రాన్తము...మాది ఇన్డస్త్రీరీల్ ప్రాన్తము. మా ఊరిలో కెమికల్ ఫ్యాక్టరి కలదు. అన్దులో మా ఊరి వాల్లని ఎవ్వరిని ఉద్యొగములోకి తీసుకొవడము లేదు...కాలుష్యము కూడా ఎక్కువగ ఉన్నది. వారి నున్ది ఎలాన్తి సమచారము తెలుసుకొవచును... |
| - అనిల్ కుమర్ |
| సమాధానము : | మండల తహశీల్దారు కార్యాలయానికి ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి.
మీ ఊరిలో గల కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్మాణ అనుమతి పత్రాలు, స్థానికులకు కల్పించిన ఉద్యోగావకాశాలు, ఉద్యోగాల సంఖ్య, కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన అనుమతి పత్రాలు, పర్యవేక్షించిన అధికారుల పేర్లు, హోదా, కార్యాలయ చిరునామా, తదితర వివరాలు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు మీ సమీపంలో ఉన్న ఈనాడు ముందడుగు జిల్లా కార్యాలయాలకు ఫోన్ చేయగలరు.
|
|
|
| మెము ఫొలీసు సఖ నున్ది సమాచారమ్ పొన్దవచ్హ?
నెను అదిగెదఎమితన్తె ఫొలీసులును ఏ సమాచారమ్ అదగవచూ?
|
| - కిరన్ |
| సమాధానము : | పొందవచ్చు. విచారణాంశాలు, దర్యాప్తును నిరోధించే సమాచారాన్ని ఇవ్వరు. దర్యాప్తు ముగిసిన అంశాలు, పాలనా పరమైన సమాచారాన్ని తీసుకోవచ్చు.
|
|
|
| నా సోదరుని జీ పీ ఫ్ ధనము కొరకు లీగల్ హిర్ పత్ర్ ము కొరకు ఎవరిని అద్ గాలి. మ్ ర్ ఒ ని అడ్ గినా పలితము లెక పొఇన్ద్. |
| - ఫి శ్ ణ్ మూర్టీ |
| సమాధానము : | మీ తమ్ముడు లీగల్ హైర్ సర్టిఫికెట్ కొరకు మీ ప్రాంతంలోని తహశిల్దార్ ఆఫీసుకు దరఖాస్తు చేసుకుని తహశిల్దారు వద్ద నుంచి పొందవచ్చు.
|
|
|
| ఒక గొప్ప ముందడుగు.
కాని ఆన్ లైన్ లో కూడ దరకాస్తులు పంపే వెసులుబాటు కలిపించవలసిన్దిగా కోరుచున్నాము.
ఈనాడు కు నా ధన్యవాదములు. |
| - కొత్తపేట.కృష్ణ శమంత్, సూర్యాపేట |
| సమాధానము : | రాష్ర్ట సమాచార కమిషన్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. |
|
|
| "ఈనాడు ముందడుగుకార్యక్రమము" తో ప్రభుత్వాల కళ్ళు తెరిపించవచ్చు. సమసమాజ నిర్మానానికి "సమాచారహక్కు ఎంతగనో దోహదపదుతుంది".
ఎన్.వనజాకుమారి;
బి.ఎస్సీ[ద్వితీయ సంవత్సరం],
కొండమల్లేపల్లి , నల్లగొండ జిల్లా. |
| - ఎన్. వనజా కుమారి |
| సమాధానము : | మీ సహకారం మా ముందడుగు ప్రతినిధి నరసింహులు (99519 44226) కు అందజేయగలరు. |
|
|
| ధరలు పెరుగుతున్నాయి అని అన్ని రాజకీయ పక్షాలు గగ్గోలు పెడుతున్నారు, కాని వాళ్లే కారణం అని మరిచిపోతున్నారు. దేశవ్యాప్తంగా అరచి గోల చేసి వరి మొదలుకొని అన్ని ఆహారధాన్యాల ధరలు పెంచే వరకు ధర్నాలు చేసారు. తీరా ప్రభుత్వం ధరలు పెంచగానే ధరలు పెరిగాయని యాగి చేస్తున్నారు. అన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. ఆవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా కుదురుతుందని ఫ్ర్రజలు ఆలోచించాలి. నాయకులు ఆలోచించాలి.. ఈనాడు చొరవ తీసుకుని ప్రజలకి ఈవిషయాలు విపులపరచాలి. |
| - కుమార్ |
| సమాధానము : | ప్రజా క్షేమమే పత్రిక ధ్యేయంగా 'ఈనాడు ' నిలుస్తుంది. మీ సహకారంతో సహ చట్టాన్ని ఉపయోగించి ప్రజా సమస్యలపై దరఖాస్తులు సంధించండి |
|
|
| పేదవారి సమస్యలపైనే దరఖాస్తులు చేయాలి. |
| - రాము, కాకినాడ |
| సమాధానము : | మీరు మేము కలసి పేదల సమస్యలపై దరఖాస్తు చేద్దాం. మీ సహకారం మా ముందడుగు ప్రతినిధి సురేష్ (99519 33722) కు అందజేయగలరు. |
|
|
| జిల్లాస్థాయిలో న్యాయవాదుల కమిటీలను ఏర్పాటు చేయాలి. |
| - టి.శీన్రివాస్, సూర్యాపేట |
|
| కళాజాతల నిర్వహణ, గోడలపై ప్రకటనలు రాయించాలి. |
| - బాలయ్య, మహబూబ్‌నగర్ |
|
| పర్యావరణ సమస్యలపై పోరాడాలి. |
| - మహేష్, సిద్ధిపేట |
|
| కళాశాలల్లో సహ చట్టంపై క్లబ్బులు ఏర్పాటు చేయాలి |
| - వెంకటరమణ, విశాఖపట్నం |
|
| రక్షణ రంగ మాజీ ఉద్యోగులు, విశ్రాంత ఉపాధ్యాయులు, డ్వాక్రా మహిళలను ఉద్యమంలోకి ఆహ్వానించాలి. |
| - గోళ్ల హరిబాబు, కృష్ణా జిల్లా |
|
| సమాచార హక్కుపై ఉద్యమించడానికి జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి. |
| - ప్రొఫెసర్ విష్ణుమూర్తి, శీక్రాకుళం. |
|
| సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని సమాచార ఉద్యమాన్ని నిర్మించాలి. |
| - గడ్డప్ప, చిత్తూరు |
|
| ప్రభుత్వ శాఖలు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన 4(1)(బి) సమాచారాన్ని ఇవ్వట్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం, సమాచార కమిషన్ ఏ చర్యలూ తీసుకోవట్లేదు. |
| - శివకుమార్, అనంతపురం |
|
| కమిషన్ తప్పుడు తీర్పులపై హైకోర్టులో రిట్ వేయాలి |
| - రవీందబ్రాబు, హైదరాబాద్ |
|
| ప్రజలకు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి. |
| - నర్శింహా, నల్గొండ |
|
| entho manchi chestuna enadu pramukhulu e site petti inka chala sahayapadutunnaru samajaniki. abhinandanalu.
|
| - కిరన్ కుమర్ |
|
|
|
SULTAN BAZAAR& KOTI
good morning sharathbabu sir i am tell about one problem many people working in sultan bazaar cloth show rooms .
there is no freedom, no good salary's. mainly ladies facing lot of problems mentally. there is no toilets facilities
they are using public toilets but public toilets are uncomfortable . they are working compulsory 12hr and 15augest 26 Jan also
but they are working. only her financial problem labour holy day also they did not give holy day and some shop owners
3065 days open the shoppe why because they are non locals. they did not maintain workers rules and regulations. if any worker asking
festival holy day they did not give holy day. they give only deepavali and dhasara per year.
i am expecting this problem as early clear the problem. this is first time i am reporting one press. i will started public
service with eenadu.
any mistake in my letter please excuse me because i am learning stage in English thank you for giving this opportunity.
waituing for your replay
thanks sharathbabau sir
|
| - దెవ్ |
| సమాధానము : | Use RTI Act 2005 and apply an application to PIO, Labour department, Hyderabad. Further assistance please contact Mr. Sharath babu ph: 99519 39922. |
|
|
| నమస్కరమ్ సర్ ............
"బాలికా సంరక్షణా పథకం" హెల అప్ప్ల్య్ చెయవలను వివరలు తెలుపగలరు. |
| - యాదగిరి .యమ్ |
| సమాధానము : | ఒక కూతురు పుట్టిన తర్వాత పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్న వారికి బాలికా సంరక్షణ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తారు. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ది పథకం) కార్యాలయాన్ని సంప్రదించండి. |
|
|
| ఈనాడు ప్రయత్నం అభినందనీయం... |
| - వంశీ చెరుకుమల్లి |
| సమాధానము : | మీ ఆదరణకు కృతజ్నతలు |
|
|
| నమస్కరమ్
మా ఊరిలో ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు, ఎన్నికలు జరిగి రెండేళ్ళు అవుతుంది.
|
| - పిలి.రామక్రిష్న |
| |