శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: చట్టాలకు అతీతంగా ప్రవర్తించకూడ...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
చట్టాలకు అతీతంగా ప్రవర్తించకూడదు
ప్రచురణ తేది: 18/09/2009

* రంగారెడ్డి సివిల్ జడ్జి వెంకటేశ్వరరెడ్డి
* '
ఈనాడు' ముందడుగు ఆధ్వర్యంలో సదస్సు

సూరారంకాలనీ, సెప్టెంబరు 17 (న్యూస్‌టుడే):చట్టాలకు అతీతంగా ఎవ్వరూ ప్రవర్తించకూడదని, వాటిపై స్థూలంగా అవగాహన కలిగి ఉండాలని రంగారెడ్డి జిల్లా సివిల్ జడ్జి . వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సూరారంలోని సీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, సెయింట్ మార్టిన్ పీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలల్లో 'ఈనాడు-ముందడుగు' ఆధ్వర్యంలో గురువారం సమాచార హక్కు చట్టం, ర్యాగింగ్ వ్యతిరేక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కొత్తగా కళాశాలకు వచ్చే విద్యార్థులతో స్నేహంగా మెలగాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటం వల్ల సున్నిత మనస్తత్వం గల వారు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది. దీనివల్ల ర్యాగింగ్ చేసిన వారు భవిష్యత్తును కోల్పోతారన్నారు. జైలు జీవితం గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను సమాచార హక్కు చట్టం కింద తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. కార్యక్రమంలో ముందడుగు కో-ఆర్డినేటర్ మధుబాబు, కళాశాల ప్రిన్సిపాల్ జి.సుధాకర్, హెచ్‌వోడీ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

ర్యాగింగ్ వ్యతిరేక సదస్సులు అవసరం
ర్యాగింగ్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహస్తే బాగుంటుంది.
- శాలిని, ఎంసీఏ, రెండో సంవత్సరం.

.. చట్టంతో అవినీతికి చెక్
సమాచార హక్కు చట్టం ఉందన్న విషయమే నాకు ఇంతవరకు తెలియదు. సదస్సు వల్ల కొత్త విషయాలను తెలుసుకున్నాను. చట్టం వల్ల ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న అవినీతిని, మనకు కావలసిన సమాచారాన్ని రాబట్టవచ్చు.
- బి.పవన్‌కుమార్, ఎంసీఏ, రెండో సంవత్సరం.

అవగాహనతో సమస్య తగ్గుముఖం
ప్రస్తుత సమయంలో ర్యాగింగ్ పై అవగాన రావడంతో జూనియర్ విద్యార్థులపై సీనియర్‌లు జాగ్రతగా ఉంటున్నారు. వారు సీనియర్‌లపై ఎలాంటి ఫిర్యాదు చేస్తారోనన్న భయం నెలకొని ఉంది.
- యస్.సాయికుమార్, ఎంసీఏ.

చట్టాలను తెలుసుకోవాలి
సీనియర్ విద్యార్థులు జూనియర్‌లతో స్నేహంగా ఉంటే ఎలాంటి దుష్పరినామాలు తలెత్తవు. ఒకవేళ ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉండాలి. సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
- శ్రావణి, ఎంసీఏ.

పరిస్థితి గుర్తెరిగి మెలగాలి
నేను కూడా ఒకప్పుడు జూనియర్‌ను అనే విషయాన్ని గుర్తుంచుకుంటే సీనియర్, జూనియర్ అనే భేదం లేకుండా చదువులో కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సంతోషంగా కళాశాల సమయం గడపవచ్చు.
- సరస్వతి, ఎంసీఏ.

* ర్యాగింగ్ వ్యతిరేక సదస్సులు నిర్వహస్తూ విద్యార్థుల్లో మార్పును తీసుకురావడం వారి భవిష్యత్తుతో పాటు దేశ ప్రగతికి దోహదం చేస్తుంది.
- పద్మజ, ఎంసీఏ

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008