శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: అప్పీలేట్ అధికారికీ శిక్ష
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
అప్పీలేట్ అధికారికీ శిక్ష
ప్రచురణ తేది: 01/09/2009

చట్ట స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ప్రవర్తించిన అప్పీలేట్ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. అప్పీలేట్ అథారిటీ వ్యవస్థ నిరుపయోగంగా మారుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర సమాచార కమిషనర్ శైలేష్ గాంధీ సంచలన తీర్పు ఇచ్చారు. అమిత్ మెహతా అనే వ్యక్తి సమాచారం కోరుతూ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేశారు. నిర్దేశిత గడువులోగా సమాచారం రాకపోవడంతో సీఐసీకి అమిత్ ఫిర్యాదు చేశారు. దాన్ని పరిశీలించిన సీఐసీ. ఫిర్యాదును పరిష్కరించాలంటూ అప్పీలేట్ అధికారి అయిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అయినా.. రిజిస్ట్రార్ స్పందించలేదు. దాంతో అమిత్ తిరిగి సీఐసీని ఆశ్రయించారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్.. రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశించింది. చర్యలు తీసుకున్నట్లుగా తెలియజేసే పత్రాన్ని తమకు పంపించాలని అందులో పేర్కొన్నారు.

- ఆర్.శ్యాం, ఒంగోలు

News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008