శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: మా నిబంధనలు మావి!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
మా నిబంధనలు మావి!
ప్రచురణ తేది: 20/10/2009

4, 3 కాగితానికి - రూ.2 ప్లాపీ (1.44 ఎం.బి.) - రూ.50
సీడీ (700 ఎం.బి.) - రూ.100 డీవీడీ - రూ.200

ట్టం చెప్పిన సమాచార రుసుం ఇదైతే.. వరంగల్ జిల్లా అధికారులు మాత్రం సొంత రుసుంను అడుగుతున్నారు. సీడీకి రూ.500, పేజీకి రూ.2.50 చెల్లించమంటున్నారు. 2007 నుంచి 2009 వరకు జిల్లాలోని చెరువులు, కాలువలు, చెక్‌డ్యాముల నిర్వహణ, మరమ్మతులకు విడుదలైన నిధుల వివరాలను అడుగుతూ వరంగల్‌కు చెందిన ప్రశాంత్ దరఖాస్తు చేశారు. సమాచారాన్ని సీడీ రూపంలో ఇవ్వాలని కోరారు. స్పందించిన నీటిపారుదల శాఖ ఎస్.. 'మీరు అడిగిన విధంగా సమాచారం అందించడానికి ఇద్దరు అధికారులు పని చేయాలి, సీడీ కి రూ.550 (రూ.500+50) చెల్లించడ'న్నారు. 'రుసుం కట్టిన 45 రోజుల్లోగా సమాచారం పంపుతామ'ని సెలవిచ్చారు. సమాచారం ఇవ్వడానికి గడువు 30 రోజులేనన్న సంగతిని మర్చిపోయారు. ఐకేపీ కింద నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలను గురించి అడుగుతూ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరక్టర్‌కు ప్రశాంత్ మరో దరఖాస్తు చేశారు. 'సమాచారం 1701 పేజీలు ఉంది. పేజీకి రూ.2.50 చొప్పున రూ.4,252.50 కట్టండి' అని పీఐవో లేఖ పంపారు. ఇదండీ.. సహ చట్టంపై జిల్లా స్థాయి అధికారుల అవగాహన!

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008