| కేటాయింపుల్లేవు! |
| ప్రచురణ తేది: 01/09/2009 |
|
సహ చట్టానికి ప్రచారం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న 'చిత్తశుద్ధి'కి నిదర్శనమిది. చట్టం వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ప్రచార నిమిత్తం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తెలిపింది. సహ చట్టం సెక్షన్ 26(1) ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించడానికి కేటాయించిన నిధులు, ఖర్చు వివరాలను అడుగుతూ ప్రధాన పరిపాలన శాఖ గుంటూరుకు చెందిన ఒ.శ్రీహరి దరఖాస్తు చేశారు. సెక్షన్ 6(3) కింద దాన్ని సమాచార పౌరసంబంధాల శాఖకు జీఏడీ సంయుక్త కార్యదర్శి బదిలీ చేశారు. ఆ తర్వాత ఐఖీపీఆర్ ఉప సంచాలకులు సమాచారమిస్తూ 'సహ చట్టంపై అవగాహన కల్పించుటకు ఈ కార్యాలయం నుంచి ఎలాంటి నిధులూ కేటాయించలేదు' అని పేర్కొన్నారు. 'సహ చట్టం ఉంది.. మీకు కావల్సిన వివరాలను దరఖాస్తు చేసి తీసుకోండి' అని ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ చెబుతుంటారు. అసలు చట్టం అంటూ ఉందని ప్రజలకు తెలిస్తేనే కదా సమాచారం అడిగేది!
|
|