శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: స.హ. చట్టంతో ప్రజాస్వామ్య పరిర...
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
స.హ. చట్టంతో ప్రజాస్వామ్య పరిరక్షణ
ప్రచురణ తేది: 12/10/2009

* అవగాహన సదస్సులో వక్తల అభిప్రాయం

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే :
మాచార హక్కు చట్టం సామాన్యుల చేతిలో వజ్రాయుధం అని వక్తలు పేర్కొన్నారు. చట్టంపై అవగాహన కల్పించడం ద్వారా స్వార్థపరుల నుంచి సమాజాన్ని కాపాడవచ్చని తెలిపారు. ఆదివారం వాసవిక్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం పప్పులవీధిలోని పాండురంగ అన్నదాన సమాజం కల్యాణ మండపంలో సమాచార హక్కు చట్టం నిర్వహించిన అవగాహన సదస్సులో పలువురు మాట్లాడుతూ చట్టానికి సోమవారంతో నాలుగేళ్లు పూర్తవుతుందని తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడంలో 'ఈనాడు ముందడుగు' సేవలు అభినందనీయమన్నారు. సదస్సులో వాసవిక్లబ్ అధ్యక్షుడు ప్రసాద్, సమాచార సాధన కమిటీ ప్రతినిధి చెవుల యుగంధర్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి మంచిగంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో వివిధ వర్గాల ప్రముఖుల అభిప్రాయం వారి మాటల్లోనే..

చట్టంతో ప్రజాస్వామ్య పరిరక్షణ
-
మాదాల గోపాలయ్య, అమరజీవి స్మారక భవనం అధ్యక్షుడు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఇలాంటి చట్టాలు ఉండాలి. పరిపాలన రహస్యం లేకుండా నిస్వార్ధంగా జరగాలంటే ప్రభుత్వాలను నిలదీయాల్సిన అవసరముంది. అది సమాచార హక్కు చట్టం ద్వారా సాధ్యమవుతుంది.

ప్రతి జీవోను తెలుసుకోవచ్చు
-
వెంకట రమేష్‌బాబు, వాసవిక్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి
ప్రభుత్వంలోని ప్రతి జీవోను చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి అవగాహన సదస్సుల ద్వారా మరింతగా చట్టంపై విజ్ఞానం పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు చట్టం గురించి తెలుసుకోవాలి.

ప్రతిఒక్కరికీ అడిగే హక్కు
-
చల్లాయానాదయ్య, సమాచార హక్కు సామాజిక పర్యవేక్షణ సమితి ప్రధాన కార్యదర్శి
చట్టం ద్వారా సమాచారాన్ని చట్ట రూపేణా తెలుసుకోవచ్చు. ప్రజలకు సమాచారాన్ని అడిగే హక్కు ప్రభుత్వం కల్పించింది. రహస్య సంస్కృతిని తగ్గించి పాలకులకు పారదర్శకత పెంపొందించవచ్చు. అడిగే వారు ఉంటే మోసం చేసే వారు తగ్గుతారు.

చట్టం గురించి విధిగా తెలుసుకోవాలి
-
జమిలి అన్నపూర్ణ, వాసవి క్లబ్ వనితా అధ్యక్షురాలు
చట్టం ద్వారా ప్రజా శ్రేయస్సుకు అవసరమైన ఆయుధం మన చేతిలోనే ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని విధిగా తెలుసుకోవాలి.

అడిగే హక్కుందని ధైర్యం
-
జమితి శిరీషా, వాసవిక్లబ్ వనితా కార్యదర్శి
చట్టం ద్వారా మనకు అడిగే హక్కు ఉందని ధైర్యంగా ఉంది. భవిష్యత్తులో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడుతా.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008