| ఏది అడిగినా.. అదే జవాబు |
| ప్రచురణ తేది: 06/10/2009 |
|
ద రఖాస్తులను తిరస్కరించడమే పనిగా పెట్టుకున్న అధికారులకు ఎందులోనూ 'ప్రజా ప్రయోజనం' కనపడదు. అడిగింది ఏంటని చూడకుండానే వారు.. సెక్షన్ 8ను అన్వయించేస్తున్నారు. విద్యార్థుల బస్సు పాసులకు సంబంధించిన సమాచారాన్ని అడిగితే.. ప్రజాప్రయోజనం లేదంటూ ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ కార్యాలయ (విశాఖపట్నం) అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. బస్సు పాసు పొందాలంటే క్యాట్ కార్డు తీసుకోవాలని విద్యా సంవత్సర ప్రారంభంలో కళాశాలల విద్యార్థులపై విశాఖ ఆర్టీసీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీనిపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో బస్సు పాసుల మంజూరుకు క్యాట్ కార్డు తప్పనిసరని చెప్పే నిబంధనల ప్రతులను కోరుతూ విశాఖకు చెందిన ఎస్.కె.అలీషా జులై 7, 2009న సహ దరఖాస్తు చేశారు. దానికి స్పందించిన ప్రాంతీయ మేనేజర్ కార్యాలయ ప్రజా సమాచార అధికారి 'మీరు కోరిన దానిలో ప్రజాప్రయోజనం లేదు.. సెక్షన్ 8(1)(జె) కింద దరఖాస్తును తిరస్కరిస్తున్నామ'న్నారు. ప్రజాప్రయోజనం లేని వ్యక్తిగత సమాచారం, ఇతరుల ఆంతరంగిక జీవనానికి భంగం కలిగించే సమాచారాన్ని మాత్రమే ఇవ్వక్కర్లేదని సెక్షన్ 8(1)(జె) చెబుతోంది. రాయితీతో ఇచ్చే బస్సుపాసులకు సంబంధించిన సమాచారానికీ.. ఈ సెక్షన్‌కూ ముడిపెట్టడం అవగాహనారాహిత్యమా? ఉద్దేశపూర్వకమా? ... |
|