శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: పదోన్నతుల్లో పారదర్శకత
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
పదోన్నతుల్లో పారదర్శకత
ప్రచురణ తేది: 25/08/2009

దోన్నతులను నిర్థరించడానికి డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ కమిటీలు (డీపీసీ) నిర్వహించే సమావేశాల మినిట్స్‌ను సహ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిందేనని ఉత్తరప్రదేశ్ కమిషన్ తీర్పు ఇచ్చింది. సెక్షన్ 8(1) కింద మినహాయింపులు వర్తించవని స్పష్టం చేసింది. పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకత సాధనకు, పక్షపాతరహితంగా ఉద్యోగులకు న్యాయం జరగడానికి 'మినిట్స్' అందజేత ఉపయోగపడుతుందని పేర్కొంది. తన కంటే వెనుక వచ్చిన వారికి ఇచ్చి గత నాలుగేళ్లుగా తనకు పదోన్నతి కల్పించకపోవడంపై హరే నారాయణ్ శుక్లా అనే ఉద్యోగి సహ దరఖాస్తు చేశారు. డీపీసీ సమావేశ మినిట్స్‌ను అడిగారు. సంబంధిత అధికారులు మాత్రం ' సమాచారం నిషేధం' అని చెప్పారు. శుక్లా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారించిన కమిషన్.. దరఖాస్తుదారుకు పూర్తి సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008