శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: సహ మార్గంలో.. 'పయనం'
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
సహ మార్గంలో.. 'పయనం'
ప్రచురణ తేది: 22/09/2009

సొంత, అద్దె వాటితో కలిపి మొత్తం 21,335 బస్సులు.. రోజుకు 77 లక్షల కిలోమీటర్ల ప్రయాణం.. గమ్యస్థానాలకు చేరే ప్రయాణికుల సంఖ్య రోజుకు 148 లక్షలు.. సగటున రోజుకు వచ్చే ఆదాయం (ఎర్నింగ్స్) 1249 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) 'భారీతనాన్ని' తెలిపే గణాంకాలివి. వీటిని చూసి అంతా బాగే అనుకుంటే పొరపాటే. రద్దీ రూట్లలో బస్సుల కొరత, తక్కువ సంఖ్యలో కొత్త బస్సులు వంటి సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి.

రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 2938 (ఆర్టీసీ వెబ్‌సైట్ ప్రకారం). మరి గ్రామాలకు బస్సులెందుకు నడవట్లేదు? రహదారులు లేకపోవడమే కారణమా? గ్రామాల ప్రజల ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలేంటి? బస్సు సౌకర్యం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులపై తీసుకున్న చర్యలేంటి?

* హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లో లక్షల సంఖ్యలో ఉన్న ప్రయాణికులకు తగ్గట్లుగా సిటీ బస్సులను పెంచరెందుకు? సామర్థ్యానికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడుతోంది?

* రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్సులను కొనుగోలు చేయకుండా అద్దె వాటిని తిప్పడానికి గల కారణాలేంటి? డిపోల వారీగా అద్దె బస్సుల యజమానుల వివరాలు, వారికి చెల్లిస్తున్న మొత్తమెంత?

* ఆర్టీసీకి రావాల్సిన బకాయిలెన్ని? ఎవరెవరి నుంచి అవి రావాలి?

* ఆర్టీసీ ఆస్తుల మాటేంటి? అవి భద్రంగా ఉంటున్నాయా?

* పండగల సీజన్‌లో 'ప్రత్యేక' బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి ఆర్టీసీ వసూలు చేస్తున్న అదనపు మొత్తాలపై నిబంధనలేం చెబుతున్నాయి?

ప్రశ్నలన్నింటికి సహ చట్టం సెక్షన్ 6(1) కింద సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆర్టీసీలో మెరుగైన నిర్వహణకు 'సహ' రూపేణా తోడ్పడవచ్చు.

ఇంకేం అడగొచ్చు?
* ఆర్టీసీ కాంప్లెక్సులు, డిపోల్లో గల దుకాణాల అద్దెల వివరాలు, టెండర్ ప్రక్రియలకు సంబంధించిన సమాచారం.

* కాలపరిమితి దాటినా వినియోగంలోనే ఉన్న బస్సుల వివరాలు

* ఆర్టీసీలో పింఛన్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు

* గ్యారేజి నిర్వహణ ఖర్చు వివరాలు, బస్టాండులలో పారిశుద్ధ్య మెరుగుదలకు, మరుగుదొడ్ల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు

* టిక్కెట్ యంత్రాలున్న బస్సుల్లో (కండక్టర్ రహిత) డ్రైవర్లుగా ఎవరిని పంపిస్తున్నారు? రెగ్యులర్ ఉద్యోగులనా? కాంట్రాక్ట్ డ్రైవర్లా?నిబంధనలేంటి?

ప్రమాదాలు సంభవించినప్పుడు..
* బస్సు నడిపిన డ్రైవర్ కాంట్రాక్ట్ ఉద్యోగా?శాశ్వత ఉద్యోగా? (కాంట్రాక్ట్ డ్రైవర్ లాంగ్ రూట్లలో బస్సును నడపకూడదు)

* జరిగిన ప్రమాదంపై విచారణాధికారి సమర్పించిన నివేదిక ప్రతుల నకళ్లు, నివేదికపై తీసుకున్న చర్యల వివరాలు

ఇదీ ముఖ్యమే..
కొన్ని చోట్ల ఆర్టీసీ స్థలాలను బి..టి.(బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో తక్కువ లీజుతో కొన్ని సంస్థలకు కట్టబెడుతున్నారు. పద్ధతిపై ఇచ్చిన స్థలాల వివరాలు, ఒప్పంద పత్రాల నకళ్లను సహ చట్టం కింద తీసుకోవచ్చు. స్థలాల అప్పగింతలోని పారదర్శకతను పరిశీలించవచ్చు.
డిపో స్థాయిలో.. పీఐవో - డిపో మేనేజర్, .. -చీఫ్ ట్రాఫిక్ మేనేజర్
ప్రాంతీయ కార్యాలయంలో.. పీఐవో - పర్సనల్ అధికారి, .. - ఆర్.ఎం.
ఆర్టీసీ ఇస్తున్న రాయితీల వివరాలను www.apsrtc.gov.in లో చూడవచ్చు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం 'బస్‌భవన్'లోని పీఐవోల చిరునామాలనూ తీసుకోవచ్చు.
- ఓగూరి శ్రీహరి, గుంటూరు

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008