శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: వార్తలు :: అక్కడ 'ఆటలు' సాగవు!
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
వార్తలు
అక్కడ 'ఆటలు' సాగవు!
ప్రచురణ తేది: 20/10/2009

ప్రభుత్వ అధికారులను చూస్తూనే మన రాష్ట్ర సమాచార కమిషన్‌కు 'దయా గుణం' పొంగి పోర్లిపోతూంటుంది. జరిమానాలు విధిస్తే ఏక్కడ బాధపడిపోతారోనని.. చట్టానికి అడ్డంగా తూట్లు పొడిచిన వారిని కూడా 'హెచ్చరించి' వదిలేస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు మన కమిషన్ జరిమానాలు విధించింది వేళ్లపై లెక్కించదగిన సందర్భాల్లోనే. వాటిలోనూ గరిష్ఠ జరిమానాలు ఎన్ననంటే.. అతి స్వల్పం. మన పక్కనున్న తమిళనాడులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన 40 మంది అధికారులకు అక్కడి కమిషన్ రూ.25 వేల జరిమానా విధించింది.

కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకుంటే.. రోజుకు రూ.250 చొప్పున రూ.25 వేల జరిమానా విధించవచ్చు. మన రాష్ట్రంలో కేవలం 2 సందర్భాలలో మాత్రమే (2009 జులై వరకు) కమిషన్ గరిష్ఠ జరిమానా విధించింది. సరే.. అధికారులు వెంటనే సమాచారమిస్తున్నారా అంటే అదీ లేదు. తమిళనాడులో మాత్రం వివిధ శాఖలకు చెందిన 40 మంది అధికారులకు గరిష్ఠ జరిమానాలు (రూ. 25 వేలు) పడ్డాయి. అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర కమిషన్ సంబంధిత శాఖల సిఫార్సు చేసింది.

విద్యార్థి విజయం
కడలూర్ జిల్లాకు చెందిన సీ.అరులప్పరాజ్ ఇంటర్ పూర్తి చేసి ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సీటు దక్కలేదు. ఉన్నత విద్యాశాఖ పేర్కొన్న నిబంధనల ప్రకారం మెడికల్ సైన్సెస్ ప్రాస్పెక్టస్‌ను ముద్రించలేదనే అనుమానం విద్యార్థికి వచ్చింది. ప్రాస్పెక్టస్ రూపకల్పనకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ పేర్కొన్న నిబంధనలు తెలపాలంటూ సెప్టెంబరు 2007లో సహ దరఖాస్తు చేశాడు. దాన్ని తిరస్కరిస్తున్నట్లు 3 నెలల తర్వాత సమాధానమచ్చింది. దీంతో కమిషన్‌కు రాజ్ ఫిర్యాదు చేశాడు. ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదంటూ కమిషన్ సంబంధిత అధికారికి 25 వేల జరిమానాను విధించింది. బాధ్యుడైన మెడికల్ అధికారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలంటూ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఇలా.. ఎన్నో ఉదంతాల్లో కమిషన్ దరఖాస్తుదారుల పక్షం వహిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తోంది.

ట్టణాలతో పోలిస్తే గ్రామీణలే చట్టాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. సమాచారం ఇవ్వని ప్రభుత్వ అధికారులకు గరిష్ఠ జరిమానా విధించడంతో పాటు క్రమశిక్షణ చర్యలకూ సిఫార్సు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుకు రవాణా ఖర్చులూ ఇప్పిస్తున్నాం. దీంతో సహ దరఖాస్తు రాగానే అధికారులు వెంటనే సమాచారం ఇచ్చేస్తున్నారు.
- ఎస్.రామకృష్ణన్, ఎస్‌సీఐసీ, తమిళనాడు
- మహ్మద్ ఆర్.హెచ్.షరీఫ్, న్యూస్‌టుడే, చెన్నై

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008