| 17 మంది ఎం.ఈ.వో.లకు స.హ. కమిషనర్ నోటీసులు |
| ప్రచురణ తేది: 05/10/2009 |
|
సమాచారం ఇవ్వని ఫలితం
నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : విద్యా శాఖలో క్రీడా పరికరాలు, సైన్సు ప్రయోగశాలల పరికరాలు, రసాయన పదార్థాల వివరాలను నెల్లూరుకు చెందిన రావూరు రమేష్‌బాబు సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వక పోవడంతో జిల్లాలో 17 మంది ఎం.ఇ.ఒ.లకు స.హ. చట్టం కమిషనర్ నోటీసులు జారీ చేశారు. అక్టోబరు పదో తేదీలోపు ఈ సమాచారం ఇవ్వకుంటే రూ.25 వేల వంతున జరిమానా, సెక్షన్ 20(2) కింద క్రిమినల్ కేసులు ఉంటాయని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. రమేష్‌బాబు ఆరు నెలల కిందట విద్యాశాఖలో సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. నెలలు గడిచినా సమాచారం ఇవ్వక పోవడంతో ఆయన దీనిపై అప్పీలు చేసినా అధికారులు స్పందించ లేదు. ఈ విషయాన్ని కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈమేరకు ఎం.ఇ.ఒ.లకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోపాలకృష్ణమూర్తిని వివరణ కోరగా సమాచార హక్కు చట్టం జారీ చేసిన నోటీసుల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. |
|