| సహ చట్టంతో అవినీతి రహిత పాలన |
| ప్రచురణ తేది: 26/08/2009 |
|
'ఈనాడు' ముందడుగు సదస్సులో వక్తలు
రాజవేట, న్యూస్‌టుడే: అవినీతి రహిత సమాజ స్థావనకు సహచట్టం ఉవయుక్తంగా ఉంటుందని ఎంపీపీ ఉట్కూరి మాధవి అన్నారు. 'ఈనాడు' ముందడుగు ఆధ్వర్యంలో మంగళవారం మండల వరిషత్తు కార్యాలయంలో సమాచార హక్కుచట్టంవై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించి ఎంపీపీ మాట్లాడుతూ అవినీతివై బ్రహ్మస్త్రం వంటిదని, స్వవ్రయోజనాలకు గాకుండా, వ్రజావ్రయోజనాల కోసం వినియోగించుకోవాలన్నారు. జడ్పీటీసీ సభ్యుడు జల్ల బిక్షపతి, ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ మేధావులు, రాజనీతిజ్ఞలు ప్రవేశవెట్టిన ఈ చట్టంవై ఈనాడు చేపడ్తున్న ఉద్యమం హర్షించదగిందన్నారు. వలువురి సందేహాలను ముందడుగు సమన్వయ కర్త కె.నర్సింహ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో వైద్యాధికారి వి.సునీత, వ్యవసాయాధికారి దేవేందర్‌రెడ్డి, హౌజింగ్ ఏ.ఈ. సతీష్, ఎమ్మెల్వో ఎ.నాగేందర్, బి.మహేందర్‌రెడ్డి, గురటి మధుసూదన్‌రెడ్డి, జస్వంత్, సురేందర్, గిరిరాజు వెంకటయ్య, ఎన్.మహేందర్‌గౌడ్, వేదాటి శ్రీదేవి, బి.ఉవ్పలయ్య, సర్పంచులు చంద్రయ్య, బాల లింగయ్య, శంకర్, చేవ్‌లా, సీఆర్పీఎఫ్ కో-కన్వీనర్ నాగరాజు, కె.ఉవ్పలయ్య, జి.శ్రవణ్, పీఆర్వోలు పాల్గొన్నారు. |
|