|
సమాచార నిరాకరణపై అధికారి పిటిషన్
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఐఏఎస్ పదోన్నతులకు సంబంధించి అడిగిన సమాచారాన్ని నిరాకరించడంపై గ్రూప్-1 అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఎ.పి.ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.వి.రమణ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 అధికారులకు సంబంధించి 2007 సంవత్సరపు రహస్య నివేదికలను కోరినా నిరాకరించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సీనియారిటీ జాబితా, అధికారుల అర్హత, నమ్మకానికి సంబంధించిన నివేదిక, జరిమానాలు తదితరాల వివరాలను ఇప్పించాలని కోరారు. .. |