|
సమాచార హక్కు చట్టం నుంచి విజిలెన్సుకు మినహాయింపు?
హైదరాబాద్, న్యూస్‌టుడే: సమాచార హక్కు చట్టం పరిధి నుంచి విజిలెన్సు-ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగాన్ని తప్పించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. విజిలెన్సు విచారణకు సంబంధించిన పత్రాలన్నీ సమాచార హక్కు ద్వారా బయటకు వెళ్తే ఇబ్బందులొచ్చే అవకాశముందని భావించి తప్పించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు, అవకతవకలపై విజిలెన్సు విభాగం విచారణ జరిపి.. బాధ్యులను గుర్తించి.. తీసుకోవలసిన చర్యలను సిఫార్సు చేస్తూ విజిలెన్సు కమిషనర్‌కు పంపుతుంటుంది. కమిషనర్ వాటిని పరిశీలించి చర్యల కోసం ఆయా శాఖలకు పంపుతారు. చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తారు. విజిలెన్సు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరైనా పొందే వీలుంది. ఏటా వందల కేసులపై విచారణ జరిపి విజిలెన్స్ నివేదికలు సమర్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను విపక్షాలు, పత్రికలు తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో విజిలెన్సు విభాగాన్ని సమాచార హక్కు చట్టం నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ... |