- కమిషన్ ఈ క్రింది పేర్కొన్న అన్ని విధులను నిర్వర్తించవచ్చు
(ఎ) రాజ్యాంగంలోను, ఇతర చట్టాల్లోను మహిళలకు కల్పించిన హక్కులను సంబంధించిన అంశాలను పరిశీలించి విచారించవచ్చు.
(బి) ఆ హక్కుల అమలుపై కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఏటా కానీ అవసరమైనప్పుడు ఎన్నిసార్లయినా గానీ నివేదికలు సమర్పించవచ్చు.
(సి) కేంద్రం కానీ, రాష్ట్రం కానీ మహిళల పరిస్థితులను మెరుగుపరచడానికి ఆయా హక్కులను సమర్థంగా అమలు చేయడానికి నివేదికల్లో సిఫార్సులు చేయాలి.
(డి) రాజ్యాంగంలోను, ఇతర చట్టాల్లోను మహిళలకు సంబంధిత అంశాలను సమీక్షించి లోపాలు సవరించడానికి సిఫార్సులు చేయాలి
(ఇ) మహిళలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు, ఇతర చట్టాలు ఉల్లంఘనకు గురైతే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలి.
(ఎఫ్) ఫిర్యాదులను పరిశీలించి ఈ కింది విషయాలను స్వచ్ఛందంగా (సుమొటో) చేపట్టాలి
(1) మహిళల హక్కులు అమలు కాకపోవడం
(2) మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలు, సమానత్వం, అభివృద్ధి లక్ష్యాలుగా రూపొందించిన నిబంధనలు అమలు కానప్పుడు
(3) మహిళల కష్టాలు తీర్చి, సంక్షేమం చూసేందుకు చేసిన విధాన నిర్ణయాలు, మార్గదర్శకాలు లేదా ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడం.
(జి) మహిళలపై వేధింపులు, వివక్ష వల్ల తలెత్తే సమస్యలు లేదా పరిస్థితులపై ప్రత్యేక అధ్యయనాలు, విచారణలకు సూచించడం, ఇబ్బందులను గుర్తించి వాటి తొలగింపునకు సూచనలు ఇవ్వడం.
(హెచ్) వివిధ రంగాల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం ఉండేలా ప్రోత్సాహక, విద్యా పరిశోధన కార్యక్రమాలను చేపట్టడం. మహిళల అభ్యున్నతికి అడ్డు తగిలే అంశాలను గుర్తించడం. గృహవసతి, ఇతర మౌలిక సదుపాయాలు, మహిళలు చాకిరీని తగ్గించే సేవలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడానికి కారణాలను తెలుసుకోవడం. వృత్తిపరమైన అనారోగ్య హేతువులను గుర్తించి ఉత్పాదకత పెరిగేలా చూడడం.
(ఐ) మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికా ప్రక్రియలను సూచించడం, వాటి అమలులో లోపాలు పంచుకోవడం
(జె) కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధిని విశ్లేషించడం
(కె) మహిళలు ఖైదీలుగా ఉన్న జైళ్ళను, రిమాండ్ హక్కును మహిళా సంస్థలను ఇతర హోమ్స్ ను తనిఖీ చేయడం, అధికారులు తనిఖీ చేసేలా చూడడం, అవసరమైతే అధికారులు లోపాలు నివారణ చర్యలు తీసుకునేలా చూడడం.
(ఎల్) మహిళల అభ్యున్నతికి సంబంధించిన నిధుల వివాదాలను పరిష్కరించడం.
(ఎం) మహిళల కష్టాలు, వేదనలకు సంబంధించిన అంశాలపై నివారణ చర్యలను ప్రభుత్వానికి సూచించడం.
(ఎన్) కేంద్రప్రభుత్వం నివేదించిన ఏ అంశం మీదనైనా
2. సబ్ –సెక్షన్ (1) లోని క్లాజ్ (బి)లలోని అంశాలకు సంబంధించిన నివేదికలను కేంద్రప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టాలి. వాటితోపాటు తీసుకున్న, తీసుకోదలచిన చర్యల మెమొరాండంను ఆమోదించని పక్షంలో అందుకు తగిన కారణాలు చూపించాలి.
- ఆ నివేదికగానీ అందులో కొంత భాగం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదైతే వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కాపీని కమిషన్ పంపుతుంది. సంబంధిత రాష్ట్ర శాసనసభలో ఆ నివేదికను ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. వాటితోపాటు తీసుకున్న, తీసుకోదలచిన చర్యల మెమొరాండంను సమర్పించాలి. కమిషన్ చేసిన సిఫార్సులకు ఆమోదించని పక్షంలో అందుకు తగిన కారణాలు చూపించాలి.
- క్లాజ్ (ఎ) సబ్ క్లాజ్ (1) ఆఫ్ క్లాజ్ (ఎస్) ఆఫ్ సబ్-సెక్షన్ (1) కింది నివేదించిన అంశాల విచారణ సందర్భంగా కమిషన్ కు సివిల్ కోర్టు అధికారాలు మరీముఖ్యంగా ఈ కింది అంశాల్లో ఉంటాయి.
(ఎ) భారతదేశంలో ఎక్కడ ఉన్న వ్యక్తినైనా ప్రశ్నించేందుకు ఆదేశించడం, హాజరయ్యేలా చూడడం.
(బి) ఏ డాక్యుమెంటునైనా కనుగొనేలా చూడడం, కమిషన్ ఎదుటకు వచ్చేలా చేయడం.
(సి) ఆఫిడవిట్లపై సాక్ష్యాలను తీసుకోవడం.
(డి) ఏ న్యాయస్థానం లేదా కార్యాలయం నుంచైనా ఏ పబ్లిక్ రికార్డునైనా లేదా కాపీనైనా కోరడం.
(ఇ) సాక్ష్యాలను, డాక్యుమెంట్లను ప్రశ్నించడానికి పరీక్షించడానికి ఆదేశాలు జారీచేయడం.
(ఎఫ్) ప్రత్యేకంగా సిఫార్సు చేసిన ఏ అంశం మీదనైనా
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు సేవకోసం నియమించబడిన అధికారులు, ఉద్యోగుల విధులు గురించి శాఖలవారీగా, జిల్లావారీగా తెలియజేయాలి. ఈ సమాచారాన్ని తెలుగులో అనువదించి వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలు అధికారులను, పాలకులను ప్రశ్నించేలా చేయవచ్చు.
|