| ఇది తెలుసా? |
రైల్వే, పౌర విమానయాన శాఖలకు సహ చట్టం కింద చేసే దరఖాస్తులను పంపడానికి తపాలా ఖర్చు ఉండదు. ప్రధాన పోస్టాఫీసుల్లో (జీపీవో) ఈ అవకాశం ఉంది. మీరు ఎవరి నుంచి సమాచారం కోరుతున్నారో ఆ పీఐవో పేరు, చిరునామా రాసి యూసీఆర్- మిసిలేనియస్ (అన్ క్లాసిఫైడ్ రిసీప్ట్స్ - మిసిలేనియస్) పద్దు కింద రూ.పది కట్టాలి. రుసుం రసీదును దరఖాస్తుకు జతచేసి జీపీవో లోని ఏపీఐవోకు ఇవ్వాలి. ఆ దరఖాస్తును పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ శాఖ ఉచితంగా రిజిస్టర్ పోస్టులో సంబంధిత కార్యాలయానికి పంపుతుంది.
|