శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: ఆర్.టి.ఐ. చట్టం :: సామాన్యుడి 'ఆశ' సందీప్ పాండే
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
ఆర్.టి.ఐ. చట్టం
సామాన్యుడి 'ఆశ' సందీప్ పాండే -

 21rti1a-1.jpg

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇద్దరు మిత్రులతో కలసి 1991లో సందీప్ స్థాపించిన సంస్థ 'ఆశ'. భారత దేశంలో పేదరికం పోవాలంటే చదువే మార్గమని భావించిన సందీప్ పేద పిల్లలకు విద్యనందించాలని తలపోశారు. అందుకు అనుగుణంగా లక్నోదగ్గర్లోని 'బలియా' కేంద్రంగా 'ఆశ'ను ఏర్పాటు చేశారు. విద్యారంగంలో సమూల మార్పులే 'ఆశ' ఉద్దేశం. దీంతో పాటు సహ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అరుణారాయ్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో కలసి సందీప్ పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ కిందటేడాది సహ చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తుల వారోత్సవాలు నిర్వహించారు.4 వేల పల్లెలకు చట్టాన్ని తీసుకువెళ్లారు. సమాచారాన్ని రహస్యంగా ఉంచడానికి అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు, సమాచార కమిషన్ల పనితీరును నిరసిస్తున్నారు.

పాండే ఏమంటున్నారంటే...

పౌరులు అడిగిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు- జాప్యానికి కారణమైన పీఐవోలను శిక్షించే బాధ్యత, అధికారం సమాచార కమిషన్లకు ఉంది. నిర్ణీత గడువు30 రోజుల తర్వాత- జాప్యం జరిగిన ప్రతి రోజుకూ దరఖాస్తుదారునికి రూ.250 నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించవచ్చు. విధంగా పీఐవోల జీతం నుంచి రూ.25,000 వరకూ కోతపెట్టే అవకాశం ఉంది. వీటిని అమలు చేయడంలోనే అసలు ఇబ్బంది. సమాచార కమిషన్లు కూడా ప్రభుత్వ యంత్రాంగంలోనే భాగమయ్యాయి. తప్పు చేసిన అధికారులను శిక్షించే విషయంలో ఇవి మరీ సుతిమెత్తగా వ్యవహరిస్తున్నాయి. దరఖాస్తుదారులను పట్టించుకోకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నాయి. ఫలానాది కావాలని దరఖాస్తు దాఖలైన వెంటనే- అధికారులు సమాచారాన్నంతా ఇష్టం వచ్చినట్లు మార్చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఫైళ్లకు ఫైళ్లనే మాయం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా.. సమాచార కమిషన్లు అధికారులను వదిలేస్తున్నాయి. పరిస్థితిలో మార్పు రావాలి. ప్రజాస్వామ్యానికి కొత్త జీవం పోసే బ్రహ్మాండమైన చట్టమిది. అమలు విషయానికొచ్చేసరికి నిర్లక్ష్యం కనిపిస్తోంది. సమాచారాన్ని అందుకోవడంలో ప్రజలకు ఇబ్బందుల్లేని వాతావారణం ఏర్పడాలి. ప్రభుత్వ శాఖలన్నీ సమాచారాన్ని వెబ్‌సైట్లలో ఉంచాలి. లక్ష్యసాధన కోసం మహోద్యమం జరగాలి. ప్రతి ఒక్కరూ అందులో భాగస్వాములు కావాలి.

పోరాటంతోనే..


+ ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో గ్రామ పంచాయతీ చేపట్టిన చర్యల వల్ల సమాచారం సులభంగా అందుతోంది. అయితే మార్పు తేలికగా జరగలేదు. పంచాయతీ ఆదాయ వ్యయాల చిట్టాను సంపాదించేందుకు మేం 11 రోజులు ధర్నా చేశాం.

+ ఒక సారి అడిగిన సమాచారం ఇవ్వనందుకు ప్రదర్శన నిర్వహించాం. సమాచారం అందించేందుకు సిద్ధమేనని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పది రోజుల సమయం కావాలని అడిగారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని మూడు రోజుల్లో ఇవ్వాలి. తర్వాత బ్లాక్ అభివృద్ధి అధికారి కేవలం పంచాయతీ ఆదాయ వివరాలను మాత్రమే ఇచ్చారు. వ్యయం ప్రస్తావన లేదు. మేం ఒత్తిడి చేసేసరికి కల్పిత సమాచారం ఇచ్చారు. పక్క పక్కనే ఉన్న ఇళ్ల మధ్య 180 మీటర్ల రహదారి వేశామని తప్పుడు లెక్క చెప్పారు. దీనిపై ఏడాదిపాటు విచారణ సాగింది. విచారణానంతరం పనుల్లో అవకతవకలు బయటపడ్డాయి.

+ మురికివాడల్లోని ప్రజలకు రేషన్‌కార్డులు అందడం లేదు. దీనిపై మరో 'సహ' ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ 'సహ' చట్టం కింద దరఖాస్తు చేశారు. రేషన్‌కార్డులు ఎందుకు జారీ చేయట్లేదో తెలపాలని కోరారు. దాంతో కోరిన సమాచారం కన్నా ముందే అర్హులకు రేషన్‌కార్డులు అందాయి.

+ మా కార్యకర్తలో ఒకరైన మున్నాలాల్ శుక్లా 30 గ్రామాలకు ఆదాయ వ్యయాల సమాచారాన్ని సంపాదించారు. సమాచారాన్ని ఇవ్వాలని బ్లాక్ పంచాయితీ కార్యాలయాన్ని కోరినప్పుడు మొదట ఇవ్వలేదు. మేం ధర్నా చేశాం. సమాచారం మోసుకెళ్లడానికి ట్రక్కు అవసరం అవుతుందని బుకాయించారు. రూ.పది వేల ఖర్చవుతుందన్నారు. అయితే సహ చట్టం కింద ఫైళ్లను తనిఖీ చేయవచ్చు. నిబంధన ప్రకారం మేం కావాల్సిన ఫైలును చూసుకుంటామని చెప్పాం. చివరికి ఆరు పేజీల సమాచారాన్ని సాధించాం. సమాచారం ఒకసారి చేతికి వస్తే మన సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు. పైన చెప్పిన సమాచారమంతా మాకు అలాగే ఉపయోగపడింది. .. 


News Page
News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008