శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా
  ఆర్.టి.ఐ. :: ఆర్.టి.ఐ. చట్టం :: సమాచార హక్కు చట్టం ‍‍‍‍2005
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
ఆర్.టి.ఐ. చట్టం
సమాచార హక్కు చట్టం ‍‍‍‍2005

అధ్యాయం - 1

ప్రాథమిక అంశాలు

1. (1) సమాచార హక్కు చట్టం, 2005గా దీన్ని వ్యవహరించవచ్చు

(2) జమ్ము, కాశ్మీర్ మినహా మిగిలిన దేశమంతటికీ చట్టం వర్తిస్తుంది (సెక్షన్లు)

(3) చట్టానికి చట్ట రూపం వచ్చిన 120 రోజునుంచి మిగతా నిబంధనలు అమల్లోకి వస్తాయి.

2. సందర్భానుసారం చట్టంలో మార్పులు రాకుంటే తప్ప,

() సముచిత ప్రభుత్వం అంటే?

(1) కేంద్రం, కేంద్రపాలిత ప్రభుత్వాలు స్థాపించిన, నెలకొ్ల్పిన, నియంత్రణలో ఉన్న, సదరు ప్రభుత్వాల నుంచి ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో నిధులు అందుకుంటున్న అధికార యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వం

(2) అలాగే రాష్ట్రప్రభుత్వ అధికార యంత్రాంగాలు, రాష్ట్రప్రభుత్వం

(బి) సెక్షన్ 12 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు అవుతుంది.

(సి) సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం కేంద్ర పౌర సమాచార అధికారి, సబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్ర సహాయ సమాచార అధికారులు నియమితులవుతారు.

(డి) సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (3) కింద ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు నియమితులవుతారు.

()సమర్ధాధికారిఅంటే?

(1) లోక్ సభ, రాష్ట్రాలు, రాష్ట్ర శాసనసభ, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభకు సంబంధించిన స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్ర విధాన మండళ్లకు సంబంధిత ఛైర్మన్లు

(2) సుప్రీంకోర్టుకు భారత ప్రధాన న్యాయమూర్తి

(3) హైకోర్టు దాని ప్రధాన న్యాయమూర్తి,

(4) రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయిన ఇతర యంత్రాంగాలకు రాష్ట్రపతి లేక గవర్నర్

(5) రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 కింద నియమితులైన అడ్మినిస్ట్రేటర్

(ఎఫ్)సమాచారం అంటే?

రికార్డులు, పత్రాలు, మెమోలు, -మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్య్కులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్లు, మోడళ్ళు, డేటా సహా ఎలక్ట్రానిక్స్ రూపంతో పాటు రూపంలో అయినా ఉన్న సమాచారం అమల్లో ఉన్న మరో చట్ట ప్రకారం ప్రైవేటు సంస్థ నుంచి అయిన ప్రభుత్వ యంత్రాంగం రాబట్టగల సమాచారం.

(జి) ‘నిర్ణీతఅనగా చట్టం నియమాల ప్రకారం ప్రభుత్వం గానీ, సమర్దాధికారి గానీ నిర్ణయించిన విధంగా

(హెచ్)అధికార యంత్రాంగంఅంటే?

) రాజ్యాంగం కింద లేదా రాజ్యాంగం ద్వారా

బి) పార్లమెంట్ రూపొందించిన చట్ట ప్రకారమైనా

సి) రాష్ట్రశాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం

డి) సముచిత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లేదా ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటయిన ప్రభుత్వ స్వపరిపాలన సంస్థలు.

(1) సముచిత ప్రభుత్వ సొంత, నియంత్రణలో ఉన్న ఎక్కువ నిధులు

(2) సముచిత ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా/పరోక్షంగా నిధులు పొందుతున్న ప్రభుత్వేతర సంస్థలు.

() ‘రికార్డు అంటే?

() ఏదైనా పత్రం, రాతప్రతి, ఫైలు

(బి) ఏదైనా మైక్రో ఫిల్ము, మైక్రోఫిష్ పత్రం

(సి) మైక్రోఫిల్ముల నుంచి తీసిన చిత్రాలు

(డి) కంప్యూటర్ మరేదైనా పరికరం నుంచి వచ్చే సమాచారం

(జె) ‘సమాచార హక్కుఅంటే అధికార యంత్రాంగం నియంత్రణలో ఉన్న సమాచారాన్ని అయినా చట్ట ప్రకారం పొందగలగడం.

(1) పనులనూ, పత్రాలనూ, రికార్డులను తనిఖీ చేసే హక్కు

(2) రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని రాసుకోవడం, వాటి నకళ్లు, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం

(3) సాగ్రికి సంబంధించిన సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం

(4) డిస్కులు, ప్లాపీలు, వీడియో కాసెట్లు రూపంలో, మరో విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందడం, అలాంటి సమాచారం కంప్యూటర్లోగానీ, మరో పరికరంలో గానీ నిక్షిప్తమై ఉంటే ప్రింట్లు తీసుకోవడం.

కె) సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (1) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు అవుతుంది.

(ఎల్) సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (3) ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు నియమితులవుతారు.

(ఎమ్) సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద రాష్ట్ర పౌర సమాచార అధికారి, సబ్ సెక్షన్ (2) ప్రకారం రాష్ట్ర సహాయ సమాచార అధికారులు నియమితులవుతారు.

(ఎన్) మూడో పక్షం అంటే అధికార యంత్రాంగం, సమాచారం అడిగే పౌరుడు కాక ఇతర వ్యక్తులు.

అధ్యాయం - 2

సమాచార హక్కు, అధికార యంత్రాంగాల విధులు

3. చట్టంలోని నిబంధనల ప్రకారం పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది.

4. (1) ప్రతి అధికార యంత్రాంగమూ

() తమ దగ్గరున్న అన్ని రికార్డులనూ పట్టికలు, పద సూచికలతో హక్కు అమలయ్యేందుకు వీలుగా నిర్వహించాలి. అన్ని రికార్డుల్లో నుంచి కంప్యూటర్లో భద్రపరచదగిన ప్రతి సమాచారాన్ని వనరుల లభ్యతపై ఆదారపడి, సహేతుక కాలపరిమితి లోపు దేశవ్యాప్త నెట్ వర్క్ లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి.

(బి) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోగా కింది వాటిని ప్రచురించాలి.

(1) సంబంధిత అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, పనులు, విధులు

(2) దాని అధికారులు, ఉద్యోగులుకున్న అధికారులు, విధులు

(3) పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్పులు, నిర్ణయ ప్రక్రియలో అనుసరించే విధానాలు,

(4) విధుల నిర్వహణలో పాటించే పద్ధతులు

(5) దాని దగ్గరలో నియంత్రణలో ఉన్న, లేదా కార్యనిర్వహణలో దాని ఉద్యోగులు పాటించే నియమ నిబంధనలు, ఆదేశాలు, మాన్యువల్, రికార్డులూ,

(6) దాని దగ్గర / నియంత్రణలో ఉన్న పత్రాల రకరకాలకు సంబంధించిన ప్రకటన.

(7) విధానాల రూపకల్నన/వాటి అమలుకు, పౌరులతో సంప్రదింపులు జరిపేందుకు/వారి ప్రాతినిధ్యం స్వీకరించేందుకు ఏదైనా పద్దతి ఉంటే...సంబంధిత వివరాలు

(8) దానిలో భాగంగా గానీ, సలహాలు ఇచ్చేందుకు గానీ ఇద్దరు, అంతకుమించి సభ్యులతో బోర్డులు, కౌన్సిళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటై ఉంటే వాటి వివరాల ప్రకటన, వీటన్నింటి సమావేశాలకు ప్రజలను అనుమతిస్తున్నదీ లేనిదీ సమావేశాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయో లేదో..

(9) దాని అధికారులు, ఉద్యోగుల సమాచార సంపుటం(పేరు, హోదా)

(10) దాని అధికారులు, ఉద్యోగులు పొందే నెలవారీ జితం, నిబంధనల ప్రకారం ఉన్న పరిహార చెల్లింపు వ్యవస్థ వివరాలు

(11) అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, జరిపిన చెల్లింపుల వివరాలు, విడిగా పేర్కొంటూ, దాని కింద ఉన్న అన్ని ఏజెన్సీలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు

(12) రాయితీ పథకాల అమలు తీరు, వాటికి కేటాయించిన నిధులు, పథకాల లబ్దిదారుల వివరాలు

(13) మంజూరు చేసే రాయితీలు, పర్మిట్లు, అనుమతులు, పొందిన వారి వివరాలు.

(14) అందుబాటులో ఉన్న/నియంత్రణలో ఉన్న సమాచారాన్ని ఎలక్ట్రానిక్స్ రూపంలో ఉంటే... వివరాలు పొందేందుకు ప్రజలకున్న సదుపాయాల వివరాలు.

(15) ప్రజల కోసం ఏదైనా గ్రంథాలయ పనివేళలు, సమాచారం పొందేందుకు ప్రజలకున్న సదుపాయాల వివరాలు

(16) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు

(17) నిర్ణయించిన తీరుగా ఇతర సమాచారం ఏదైనా, తర్వాత ఏడాదికోసారి సమాచారం అంతటినీ సరిచేసి కొత్తగా ఇవ్వడం

(సి) ముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పుడు గానీ, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు గానీ వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.

(డి) పాలనాపరమైన/అర్థన్యాయ (క్వాసీ జ్యూడీషియల్) నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వాటి కారణాలను వివరించాలి.

(2) సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (బి) నిర్ధేశిస్తున్న విధంగా, సమాచారాన్ని పొందడానికి వీలైనంత తక్కువగా ప్రజలు చట్టాన్ని ఆశ్రయించకుండా చూడటానికి...వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఎవరూ కోరకుండానే అధికార యంత్రాంగం ఇంటర్నెట్తో సహా వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అందించేందుకు కృషి చేయాలి.

(3) సబ్ సెక్షన్ (1) నిర్ధేశిస్తున్న విధంగా వ్యవహరించేటప్పుడు, ప్రతి సమాచారాన్ని ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండే రూపంలో విస్తృతంగా వ్యాప్తి చేయాలి.

(4) అన్ని రకాల సమాచారాలను వ్యాప్తి చేసేటప్పుడు...ఉచితంగా లేదా ఎంత చౌకగా పని చేయగలం, స్థానిక భాష వ్యాప్తికి స్థానికంగా బాగా ఉపకరించే పద్ధతులు, సమాచారం వీలైనంతలో ఎలక్ట్రానిక్ రూపంలో కేంద్ర పౌర సమాచార అధికారికి/రాష్ట్ర పౌర సమాచార అధికారికి అందుబాటులో ఉండటం/ప్రసార మాధ్యమాల వ్యయం/ ప్రచురణ వ్యయం అందుబాటులో ఉండటం వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

వివరణ : సబ్ సెక్షన్లు (3), (4) కు సంబంధించి వ్యాప్తి చేయడం అంటే నోటీసు బోర్డులు, వార్తా పత్రికలు, బహిరంగ ప్రకటనలు, మీడియా ప్రసారాలు, ఇంటర్నెట్/అధికార యంత్రాంగం కార్యాలయాలను తనిఖీ చేయడం సహా ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం.

(5) 1. చట్టం అమల్లోకి వచ్చిన వంద రోజుల్లోగా ప్రతి అధికార యంత్రాంగం దరఖాస్తుదారులకు సమాచారం అందజేయడానికి అన్ని పాలనా యూనిట్లు/ కార్యాలయాల్లో అవసరమైన సంఖ్యలో కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారులను నియమించాలి.

2. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోగా సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలకు విరుద్ధం కాని రీతిలో ప్రతి అధికార యంత్రాంగమూ ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో/జిల్లా విభాగాల స్థాయిలో సమాచారం కోరుతూ వచ్చే దరఖాస్తులు/అప్పీళ్లను స్వీకరించడానికి ఒకరిని కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార సహాయ అధికారిగా నియమించాలి. స్వీకరించిన వాటిని వారు వెంటనే కేంద్ర/ రాష్ట్ర పౌర సమాచార అధికారికి/సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దిష్టపరిచిన సీనియర్ అధికారికి/ కేంద్రసమాచార కమిషన్ కు /రాష్ర్ట సమాచార కమిషన్ కు పంపాలి. సమాచారం ఇచ్చేందుకు సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్ణయించిన కాలపరిమితికి అయిదు రోజులు కలపాలి.

3. సమాచారాన్ని కోరుతూ వచ్చిన ప్రతి అభ్యర్ధననూ ప్రతి కేంద్ర/రాష్ట్ర పౌర సహకారాన్నైనా కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి కోరవచ్చు.

(6) 1. చట్టం కింద సమాచారాన్ని కోరదల్చుకున్న వారు ఆంగ్లం/హిందీ/స్థానిక అధికార భాషలో రాతపూర్వకంగా/ ఎలక్ట్రానిక్ రూపంలో నిర్ణీత రుసుంతోపాటు తమ అభ్యర్ధనను కింద తెలిపిన వారికి పంపాలి.

() కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారికి / సంబంధిత అధికార యంత్రాంగానికి

(బి) తాము కోరుకున్న సమాచారం వివరాలను రాతపూర్వకంగా కేంద్ర/రాష్ట్ర సహాయ పౌర సమాచార అధికారకి పౌరుడు ఇవ్వలేని పక్షంలో మౌఖికంగా వారు చేసిన అభ్యర్ధనను రాసేందుకు యుక్తమైన సాయాన్నంతా కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి అందించాలి.

2. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారులెవరైనా అందుకు గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదు. తనకు కబురు చేసేందుకు వీలుగా చిరునామా తప్ప మరే ఇతర వ్యక్తిగతమైన వివరాలను కూడా సమర్పించనక్కర్లేదు.

3. ఒక సమాచారం కోసం అధికార యంత్రాంగానికి ఒక దరఖాస్తు అందినప్పుడు

(1) సమాచారం మరో అధికార యంత్రాంగం దగ్గర ఉన్నప్పుడు, లేక

(2) సమాచారం మరో అధికార యంత్రాంగం పనులకు ఎక్కువగా సంబంధించినదైనప్పుడు, దరఖాస్తు అందుకున్న అధికార యంత్రాంగం దరఖాస్తును గానీ/ రెండవ అధికార యంత్రాంగానికి సంబంధించిన భాగాన్ని గానీ వారికి పంపి...అలా పంపిన విషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి. దరఖాస్తును పంపడం వీలైనంత తొందరగా జరగాలి. అది దరఖాస్తు అందుకున్న నాటి నుంచి అయిదు రోజులలో పూర్తవ్వాలి.

(7) 1 సెక్షన్ 6 కింద సమాచారం కోరుతూ దరఖాస్తు అందినప్పుడు సెక్షన్ 5 (2), సెక్షన్ 6 (3) ప్రకారం వీలైనంత తొందరగా, దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా కేంద్ర, రాష్ట్ర పౌర సమాచార అధికారి సమాచారం అందించాలి. లేదా సెక్షన్ 8,9 నిర్దేశిస్తున్న కారణాల వల్ల దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలియజేయాలి. దరఖాస్తుదారుడు కోరిన సమాచారంవ్యక్తి ప్రాణానికి లేదా స్వేచ్ఛకుసంబంధించినదయితే దరఖాస్తు అందిన 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి.

2. సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాలపరిమితిలోపు కేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి సమాచార అధికారి సమాచారం కోరుతూ వచ్చిన దరఖాస్తుపై తన నిర్ణయం చేయకపోతే.. దరఖాస్తును వారు తిరస్కరించినట్లే.

3. సమాచారాన్ని అందించడానికి అయ్యే ఖర్చుకు మరికొంత రుసుం వసూలు చేయాలని కేంద్ర/రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయిస్తే... రుసుంను చెల్లించాలని చెబుతూ దరఖాస్తుదారునికి కబురు చేయాలి. అందులో.....

() సమాచారం అందించేందుకు చెల్లించాల్సిన మరికొంత రుసుం వివరాలుండాలి. సబ్ సెక్షన్ (1) కింద మరికొంత రుసుం లెక్కింపు విధానం చెప్పి మొత్తాన్ని జమ చేయాలని కోరాలి. కబురు పంపిన రోజు నుంచి రుసుం జమ అయ్యేవరకు పట్టిన వ్యవధిని సబ్ సెక్షన్ (1)లో పేర్కొన్న 30 రోజుల కాలపరిమితి నుంచి మినహాయించాలి.

(బి) రుసుంకు సంబంధించిన నిర్ణయం, సమాచారం అందించే పద్ధతి, పునఃపరిశీలనను కోరేందుకు దరఖాస్తుదారుకు ఉన్న హక్కు, దాని కాలపరిమితి, అందుకు అనుసరించాల్సిన విధానాలు, ఎవరి ముందు అప్పీలు చేయాలో తెలియజేయాలి.

4. చట్టం కింద ఒక రికార్డును/అందులో భాగాన్ని అంగవైకల్యం కలిగిన దరఖాస్తుదారుడికి చూపించాల్సి వచ్చినపుడు.. వ్యక్తి సమాచారాన్ని పొందేవిధంగా తనిఖీ చేసుకునేందుకు కేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి తగిన సాయం చేయాలి.

5. సమాచారాన్ని అచ్చు రూపంలోనో, ఎలక్ట్రానిక్ రూపంలోనో అందించాల్సినప్పుడు దానికి నిర్ణయించిన రుసుంను సబ్ సెక్షన్లు (1), (5) ప్రకారం సహేతకంగా ఉండాలి. సముచిత ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయకూడదు.

6. సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాల పరిమితిలోపు సమాచారం ఇవ్వడంలో అధికార యంత్రాంగం విఫలమైతే సబ్ సెక్షన్ (5)తో నిమిత్తం లేకుండా సమాచారాన్ని ఉచితంగా అందించాలి.

7. సబ్ సెక్షన్ (1) కింద కేంద్ర, రాష్ట్ర పౌర సమాచార అధికారి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెక్షన్ 11 కింద మూడో పక్షం సమర్పించిన వాదనను పరిగణనలోకి తీసుకోవాలి.

8. సబ్ సెక్షన్ (1) కింద ఒక దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో దరఖాస్తుదారునకు కింది విషయాలను కేంద్ర/రాష్ర్ట పౌర సమాచార అధికారి తెలియజేయాలి.

(1) దరఖాస్తును తిరస్కరించడానికి కారణాలు

(2) తిరస్కరణపై అప్పీలు చేసుకోవడానికి ఉన్న కాలపరిమితి.

(3) అప్పీలు విచారించే అధికారి వివరాలు

9. అధికార యంత్రాంగం వనరులు చాలా ఎక్కువ స్థాయిలో ఖర్చయ్యే సందర్భంలోనూ, రికార్డు భద్రత, రక్షణ ప్రమాదంలో పడుతుందన్న సందర్భంలో తప్ప దరఖాస్తుదారు అడిగిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి.

8. (1) చట్టంతో సంబంధం లేకుండా కింది సమాచారాలను పౌరులకు అందించనక్కర్లేదు.

() భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రభావం చూపించే సమాచారం, దేశ భద్రత, వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థిక ప్రయోజనాలపై, విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారం, ఏదైనా నేరాన్ని ప్రేరేపించే సమాచారం.

(బి) ఏదైనా న్యాయస్థానం/ట్రిబ్యునల్ ఏదైనా సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని ఆదేశించే ఉంటే అలాంటి సమాచారం. సమాచార ప్రకటన కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందనుకుంటే అలాంటి సమాచారం

(సి) పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ హక్కులను ఉల్లంఘించే రీతిలో ఉన్న సమాచారం.

(డి) వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేథోసంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో మూడో పక్షానికి హాని కలిగే సందర్భంలో సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తరహా సమాచారాలను వెల్లడి చేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలో దానిని కూడా వెల్లడించవచ్చు.

() విశ్వాసబద్ధమైన సంబంధం రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం, విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తరహా సమాచారాలను వెల్లడి చేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలో దానిని వెల్లడించవచ్చు.

(ఎఫ్) ఏదైనా విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాసబద్ధంగా అందిన సమాచారం