శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: రాసినా.. రాయలేదన్నారు
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
రాసినా.. రాయలేదన్నారు
ప్రచురణ తేది: 25/08/2009

చట్టం విద్యార్థికి స్వాంతన చేకూర్చింది. పరీక్షలకు హాజరైనా.. కాలేదంటూ చెప్పిన విశ్వవిద్యాలయం అధికారుల తప్పును నిరూపించింది. అహ్మదాబాద్‌లోని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్శిటి నుంచి సర్టిఫికెట్ ఇన్ కంప్యూటింగ్ పొందడానికి అంకిత్ జోషి అనే విద్యార్థి అయిదు పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడయ్యాయి. అంకిత్‌కు వచ్చిన మార్కుల పత్రంలో చూస్తే.. పరీక్షకూ హాజరు కానట్లు ఉంది. ఖిన్నుడైన అంకిత్ వెంటనే విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించారు. ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అంకిత్ సహ చట్టాన్ని ప్రయోగించారు. పరీక్షా కేంద్రంలోని హాజరు పట్టికల ప్రతులను కోరుతూ దరఖాస్తు చేశారు. వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తే.. అంకిత్ జోషి అన్ని పరీక్షలకూ హాజరైనట్లు స్పష్టమైంది. అప్పుడు దిగివచ్చిన విశ్వవిద్యాలయం అధికారులు జవాబుపత్రాలను పరిశీలించారు. అన్ని సబ్జెక్టుల్లోనూ అంకిత్ ఉత్తీర్ణుడైనట్లు చెప్పారు.

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008