|
|
| కమిషన్లకు నిధులు |
| ప్రచురణ తేది: 11/08/2009 |
|
మొ త్తం 27 రాష్ట్రాలూ సమాచార కమిషన్లను ఏర్పాటు చేసుకున్నాయని కేంద్ర పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ శాఖా మంత్రి పృథ్వీరాజ్‌చౌహాన్ తెలిపారు. రాజ్యసభలో ఒక సభ్యడు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతాలు సీఐసీ పరిధిలోకి వస్తాయని ఆయన వెల్లడించారు. సహ చట్టాన్ని సమర్థమంతంగా అమలు చేసేందుకు, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా చట్టంపై అవగాహన కల్పించేందుకు, వివిధ వర్గాల వారికి శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రాల కమిషన్లకు నిధులు ఇస్తున్నామని చెప్పారు.
సహ విజయాలు ఒక్క దరఖాస్తుతో సరి! టాస్క్‌ఫోర్స్ ఎస్.ఐ. హోదాలో వెళ్లినా పట్టించుకోని అధికారులు ఒక్క సహ దరఖాస్తుకు స్పందించారు. విశాఖపట్నంలో టాస్క్‌ఫోర్స్ ఎస్.ఐ.గా తిరుపతిరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన సామూహిక భవిష్యనిధి (జీపిఎఫ్) వివరాల కోసం హైదరాబాద్‌లోని ఆ శాఖ కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారిని కలిశారు. వివరాలన్నీ ఓ కాగితంపై రాసిచ్చి వెళ్లమని అధికారి చెప్పారు. ఇప్పటికే తాను 8 సార్లు రాసిచ్చానని తిరుపతిరావు చెప్పారు. ఆ తర్వాత విజ్ఞాపన పత్రం తీసుకున్న సంబంధిత అధికారి.. పేరు, సంతకం లేకుండా స్టాంప్ మాత్రమే వేసి ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇచ్చారు. దాని గురించి అడుగుతూ, తాను టాస్క్‌ఫోర్స్ ఎస్.ఐ.నని తిరుపతిరావు చెప్పారు. 'ఎవరైతే మాకేంటి?ఈ మాత్రం ఇవ్వడమే గొప్ప' అని అధికారి సమాధానమిచ్చారు. ఆ తర్వాత తిరుపతిరావుజీపీఎఫ్ కార్యాలయానికి సహ దరఖాస్తు చేశారు. మూడేళ్లుగా కార్యాలయానికి స్వయంగా వచ్చినా సమాచారమివ్వని అధికారులు దరఖాస్తు చేసిన మూడు వారాలకే సమాచారం పంపారు.
' తనిఖీ' చేసుకోనివ్వాల్సిందే ఎస్ఎస్సీ, హెచ్ఎస్‌సీ పరీక్షల జవాబు పత్రాలను తనిఖీ చేసుకోవడానికి అనుమతించాల్సిందేనని మహారాష్ట్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది. తన జవాబు పత్రాలను తనిఖీకి అనుమతి ఇవ్వాలంటూ పుణెకు చెందిన అభిజిత్ శ్రీపాద్ జోషి అనే విద్యార్థి మహారాష్ట్ర బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేశారు. సంబంధిత అధికారి దరఖాస్తును తిరస్కరించారు. అప్పీలేట్ కూడా ఇదే చెప్పడంతో జోషి కమిషన్‌కు రెండో అప్పీలు చేశారు.విచారించిన కమిషన్ తీర్పునిస్తూ.. జవాబుపత్రాలను పరిశీలించుకోవడానికి దరఖాస్తుదారుకి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. |
|