శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: 'ముందడుగు' స్ఫూర్తి
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
'ముందడుగు' స్ఫూర్తి
ప్రచురణ తేది: 04/08/2009

పట్టాలు సాధించిన పేదలు
బెల్లంకొండ (గుంటూరు): ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న పేదలు వారు... అధికారులు, నాయకులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గత ఏడాది సెప్టెంబరులో బెల్లంకొండలో నిర్వహించిన 'ఈనాడు ముందడుగు' సదస్సు వల్ల వారికి సహ చట్టం గురించి తెలిసింది. వెంటనే పేదలకు పంపిణీ చేసిన భూమి వివరాలు కావాలని దరఖాస్తులు చేశారు. మామూలుగానే అధికార యంత్రాంగం మొండికెత్తింది. దరఖాస్తుదారులు పట్టువదల్లేదు. మొదటి అప్పీలులోనూ అదే పరిస్థితి. రెండో అప్పీలుకు రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ నోటీసులు అందుకోగానే యంత్రాంగం కదిలింది. అధికారులు హుటాహుటిన సర్వే నంబరు 524 లో ఉన్న భూమి పంపిణీకి సిద్ధం చేశారు. మధ్యలో ఎన్నికల కోడ్ వల్ల కార్యక్రమం వాయిదా పడింది. స్థలాల 50 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో 35 మందికి గత వారం పట్టాలు అందజేశారు. మిగిలిన వారికీ త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు 'ఈనాడు ముందడుగు' ఆసరా వల్ల తమకో స్థలం దక్కిందని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సహతో కష్టాలు తీరాయి
అండా లేని మాకు సహ తోడుగా నిలిచింది. కష్టాలు తీరాయి. చట్టం గురించి ముందే తెలిసుంటే బాగుండేది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.
- షకీరా

ఇందిరమ్మకీ ఇదే అస్త్రం
ఇప్పుడిక ఇందిరమ్మ ఇంటి కోసమూ సహ చట్టాన్నే వినియోగిస్తాం. పేదల పాలిట ఇది నిజంగా బ్రహ్మస్త్రమే అని మా విషయంలో రుజువైంది.
- ఇబ్రహీంబి

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008