|
|
| సామాన్యుడే.. అయితేనేం! |
| ప్రచురణ తేది: 18/08/2009 |
|
ఆ యన వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. ప్రవృత్తి రీత్యా సహ ఉద్యమకారుడు. అవినీతి రహిత సమాజాన్ని చూడాలన్నదే ఆయన ఆశయం. అందుకనుగుణంగా దరఖాస్తులనే ఆయుధాలుగా మలచి అక్రమార్కుల పైకి సంధిస్తున్నారు. హితేందర్ జైన్.. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన ఈ ఆర్కిటెక్టు రిసెర్జన్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యుడు. సహ చట్టాన్ని ఆధారంగా చేసుకుని అధికార యంత్రాంగపు అవినీతిని వెలుగులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము దుర్వినియోగమైన వైనాన్ని ఆయన బయటపెట్టారు. రెడ్‌క్రాస్‌కు సంబంధించిన నిధులను కూడా కొందరు అధికారులు ఎలా పక్కదారి పట్టించారన్న విషయాన్ని సహ చట్టంతో ప్రజల ముందుంచారు. కార్గిల్ యుద్ధం, సునామీ బాధితులకు అందించడానికి వచ్చిన విరాళాల్లోని రూ.1.94 కోట్లు.. సంబంధితులకు చేరలేదన్న సంగతి హితేందర్ దరఖాస్తులతోనే వెల్లడైంది. దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతిని రూపుమాపడమొక్కటే మార్గమనేది హితేందర్ భావన. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని కూర్చోకుండా సహ చట్టం ఆసరాగా అవినీతిపై అందరూ తమ వంతు పోరాడాలని ఆయన అంటారు. |
|