|
|
| ఉద్యోగం వచ్చింది! |
| ప్రచురణ తేది: 04/08/2009 |
|
బీ హార్లో న్యాయాధికారుల నియామకాలకు 'బీహార్ పబ్లిక్ సర్వీసు కమిషన్' బీపీఎస్సీ) 2007లో ప్రకటన ఇచ్చింది. ధీరేంద్ర కుమార్ అనే వ్యక్తి ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పరీక్ష బానే రాశారు. కానీ ఉత్తీర్ణుల జాబితాలో ఆయన పేరు లేదు. దాంతో ధీరేంద్ర స.హ దరఖాస్తు చేశారు. సబ్జెక్టుల వారీగా తన మార్కుల్ని తెలపమని కోరారు. ఇంటర్వ్యూలు పూర్తయేంత మీ మార్కుల వివరాలు ఇవ్వలేమని పీఐవో సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూలు ముగిశాక వెబ్‌సైట్లో ఉంచిన మార్కుల జాబితాలను చూస్తే ధీరేంద్రకు 451 వచ్చాయి. అవి ఇంటర్వ్యూలకు హాజరైన కొందరి కంటే ఎక్కువే. ధీరేంద్ర బీపీఎస్సీకి మరో సహ దరఖాస్తు చేశారు. 'ఇంటర్వ్యూకు పిలిచిన అభ్యర్థులకు నిర్ణయించిన కటాఫ్ మార్కు ఎంత? నన్ను ఇంటర్వ్యూకు ఎందుకు పిలవలేదు'... సమాచారమిమ్మన్నారు. పరిశీలన అనంతరం పొరపాటు గ్రహించిన కమిషన్ ధీరేంద్రను ఇంటర్వ్యూకు హాజరవ్వమని కోరింది. ఆ ఇంటర్య్వూలో ధీరేంద్ర విజయం సాధించారు. ఇప్పుడాయన బీహార్‌లోని 'ధూంర్యో'లో సివిల్‌జడ్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. 'ఉత్తమ పౌరుడు' విభాగంలో 'నేషనల్ ఆర్టీఐ అవార్డు'కు ఎంపికయ్యారు. |
|