శోధన:   
  నిశితమైన శోధన
హొమ్ ఆర్.టి.ఐ. చట్టం వార్తలు ప్రముఖుల అభిప్రాయాలు సహ విజయాలు గ్యాలరి ప్రశ్నలు సమాచార నిధి మీ మాట పత్రాలు (డౌన్ లోడ్స్) మేము సైతం పీఐవోల జాబితా విశిష్ఠ వ్యక్తులు
  ఆర్.టి.ఐ. :: సహ విజయాలు :: దుర్వినియోగానికి ఫలితం
ఈ పేజిని ప్రింట్ చెయ్యండి  ఇష్ట అనుసందానములో చేర్చుము 
సహ విజయాలు
దుర్వినియోగానికి ఫలితం
ప్రచురణ తేది: 06/10/2009

వినీతికి పాల్పడిన సర్పంచి 'చెక్‌పవర్'ను సహ చట్టం రద్దు చేయించింది. దుర్వినియోగమైన రూ.ఏడు లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేయించింది. వరంగల్‌జిల్లా హన్మకొండ మండలం పైడిపెల్లి గ్రామ పంచాయతీ జమా ఖర్చుల వివరాలను అడుగుతూ జన్ను జేసన్ అనే వ్యక్తి సహ దరఖాస్తు చేశారు. వచ్చిన సమాచారాన్ని పరిశీలించిన జేసన్‌కు నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానం వచ్చింది. దీనిపై కలెక్టర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యుల సమక్షంలో విచారణ నిర్వహించారు. తర్వాత పది నెలల వరకు సర్పంచిపై చర్యా తీసుకోలేదు. దాంతో.. విచారణ నివేదికలు కోరుతూ డీపీఓ కార్యాలయానికి జేసన్ దరఖాస్తు చేశారు. డీపీఓ నుంచి సమాచారం వచ్చింది. వార్డు సభ్యుల తీర్మానాలు, ఎం.బి. రికార్డులు లేకుండానే రూ.7 లక్షల వరకూ పనులు జరిపించినట్లు వెల్లడైంది. ఆగస్టు 24, 2009 సర్పంచి చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ.. సొమ్ము రికవరీకి డీపీఓ ఆదేశాలు జారీ చేశారు. పల్లెల అభివృద్ధికి, అవినీతి నిరోధానికి సహ చట్టం ఎలా ఉపయోగపడుతుందో చూశారుగా.. ఇంకెందుకు ఆలస్యం దరఖాస్త్రాన్ని సంధించండి మరి.
- సుంకరి ప్రశాంత్, వరంగల్

News Page
ఏ జిల్లాలో ఏం జరుగుతోంది?:   ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోంది?:
Powered by iPowerFour మా గురించి   |   సంప్రదించండి   |   మీ స్పందన  |  © ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2008